మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ !


J.SURENDER KUMAR,


ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శనివారం నియోజకవర్గంలో వివిధ కారణాలతో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు.

వెల్గటూర్ మండలం మారేడువెళ్లి గ్రామానికి చెందిన బొల్లం లచ్చయ్య మృతిచెందగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఇదే గ్రామానికి చెందిన వ్యల్ల వెంకట్ రెడ్డి బంధువులు మృతిచెందగా వారి కుటుంబ సభ్యులను సైతం పరామర్శించారు.

ఎమ్మెల్యే వెంట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శైలేందర్ రెడ్డి కార్యకర్తలు తదితరుల ఉన్నారు.


👉గుల్ల కోట గ్రామంలో..


మండలంలోని గుల్లకోట గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగి లింగంపెల్లి చందు ఇటీవల గుండె పోటుతో మృతిచెందరు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.


👉ధర్మపురి పట్టణంలో..


ధర్మపురి పట్టణానికి చెందిన దూడ వెంకట్ అనారోగ్యంతో మృతి చెందాడు. కుటుంబ సభ్యులను పరామర్శించి , కుటుంబ సభ్యులకు ₹ 5000/- ఆర్థిక సాయం అందించారు.
👉కాసెట్టివాడలో…


పట్టణంలోని స్థానిక కాశెట్టి వాడ కి చెందిన పాదం పెద్దన్న, మరియు ఆకుల చిన్న గంగన్న అనారోగ్యంతో ఇటీవల మృతిచెందరు. వారి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పరామర్శించారు.


ఎమ్మెల్యే వెంట మండల కాంగ్రెస్ పార్టి అధ్యక్షులు సంగనభట్ల దినేష్, ఉపాధ్యక్షులు వేముల రాజేష్, రాజేష్, శ్రీనివాస్, మరియు నాయకులు, కార్యకర్తలు తదితరుల ఉన్నారు.


👉శివ కళ్యాణం లో పాల్గొన్న ఎమ్మెల్యే..


గొల్లపల్లి మండలం చిల్వకోడూరు గ్రామం శివాలయంలో జరిగిన శివ కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వేద పండితులు ఘనంగా ఆశీర్వదించి. స్వామివారి శేష వస్త్రాన్ని బహూకరించారు.