మూడు నెలల పాటు శుభ ముహూర్తాలు లేవు !

👉బుగ్గారపు ప్రసాద్ శర్మ !

J.SURENDER KUMAR,

ఈ నెల 29 నుంచి మూడు నెలల కాలం పాటు శుభ ముహూర్తాలు లేవని ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ పంచాంగ ప్రవచనకర్త, జ్యోతిష్య పండితుడు బుగ్గారపు ప్రసాద్ శర్మ తెలిపారు

ఈ సంవత్సరం ఫిబ్రవరి 11 నుంచి ఏప్రిల్ 28 2024 వరకు శుభ ముహూర్తాలు ఉన్నాయన్నారు. తిరిగి ఈ సంవత్సరం ఆగష్టు 8 నుంచి సెప్టెంబర్ 6 వరకు కొన్ని శుభ ముహూర్తాలు ఉన్నాయి. ఈ మధ్యలో అంటే ఏప్రిల్ 28 2024 నుంచి ఆగష్టు 8 2024 వరకు దాదాపు మూడునెలలు ముహూర్తాలు లేవు అని స్పష్టం చేశారు.

ఆయన మాటలలో..

👉మూఢం అంటే ? ..

నవగ్రహాలు సూర్యుడి చుట్టూ తిరుగుతాయి. వీటిలో భూమికూడా ఓ గ్రహమే. భూమి, సూర్యుడు ఒక గ్రహానికి ఒకే వరుసలో ఉన్నప్పుడు ఆ గ్రహం భూమ్మీద ఉన్నవారికి కనపడదు. దీన్నే అస్తంగత్వం లేదా, మూఢం అంటారు.

👉గురు మౌఢ్యమి – శుక్ర మౌఢ్యమి..

గ్రహాలకు రాజు సూర్యుడు. సూర్యుడికి అత్యంత సమీపంలోకి ఏ గ్రహమైనా వస్తే ఆ గ్రహం తన శక్తిని కోల్పోతుంది. అలా గురువు సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు గురు మౌఢ్యం, శుక్రడు సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు శుక్ర మౌఢ్యం వస్తుంటాయి. ఆ సమయంలో అవి బలహీనంగా మారిపోతాయి. సూర్యునికి దగ్గరగా గురు, శుక్రులు వచ్చి నప్పుడు గురు శుక్రుల శక్తులు తగ్గి బలహీనమైపోతాయి, నీరసపడతాయి, వాటి శక్తి సన్నగిల్లుతుంది. అంటే వేయి వాట్స్ బల్బు ముందు క్యాండిల్ పెడితే , ఆ క్యాండిల్ శక్తి ఎంత మామూలుగా ఉంటుందో అలాగే సూర్యుడి దగ్గరగా చేరిన గ్రహాల స్థితి అంతే బలహీనంగా ఉంటుంది. గురు, శుక్రులు శుభగ్రహాలు కాబట్టి అవి సూర్యుడికి అత్యంత దగ్గరగా ఉన్నప్పుడు మూఢాలుగా పరిగణించి ఆ రోజుల్లో ఎలాంటి పనులు చేయకూడదు అని చెబుతారు. ఎందుకంటే ఏ శుభకార్యానికి అయినా గురు, శుక్ర గ్రహాల బలమే ప్రధానం… ఈ రెండు గ్రహాలు బలహీనంగా ఉన్నప్పుడు ఏం చేసినా కలసిరాదన్నది మన జ్యోతిష్య పండితులు చెపుతుంటారు

👉కర్తరి నిర్ణయము..

వైశాఖ శుII చతుర్థీ 04-05-2024 శనివారం నుండి వాస్తు కర్తరి ప్రారంభమై వైశాఖ బII నవమి మంగళవారంవారం 28-05-2024 వరకు సమాప్త మగును.

👉గురు మౌడ్య నిర్ణయం..

చెత్ర IIబ దశమి శుక్రవారం 03.04.2024 నుండి ప్రారంభమై వైశాఖ బII ఏకాదశి ఆదివారం 02.07. 2024 వరకు సమాప్త మగును

👉శుక్ర మౌడ్య నిర్ణయం …

చైత్ర బII చతుర్థి ఆదివారం 28-04-24 నుండి ప్రారంభమై ఆషాడ శుక్ల పంచమి శుII నవమి గురువారం 21-07-24 వరకు సమాప్త మగును. మరల పాల్గుణ బII చతుర్థి మంగళవారం 18-03-25 నుండి ప్రారంభమై పాల్గుణ బII త్రయోదశి గురువారం 27-03-25 వరకు సమాప్త మగును

👉ఫై మౌడ్యముల యందు శుభకార్యములు వర్జనీయము.కావున చేయకూడదు !

👉మూఢంలో ఏఏ కార్యాలు నిర్వహించకూడదు..

శుభగ్రహాలైన గురు, శుక్రులు బలహీనంగా ఉంటారు కాబట్టి మూఢాల్లో వివాహాది శుభ కార్యాలు జరపకూడదు. లగ్నపత్రిక రాసుకోకూడదు, వివాహానికి సంబంధించిన మాటలు కూడా మాట్లాడుకోరాదు. పుట్టు వెంట్రుకలు తీయించరాదు, గృహ శంకుస్థాపనలు చేయ రాదు.ఇల్లు మారకూడదు

👉మూఢంలో ఇవి చేసుకోవచ్చు..

అన్న ప్రాసన చేసుకోవచ్చు, ప్రయాణాలు చేయవచ్చు,ఇంటి రిపేర్లు చేసుకోవచ్చు, భూములు కొనడం, అమ్మడం, అగ్రిమెంట్లు చేసుకోవడం చేయొచ్చు.
నూతన ఉద్యోగాల్లో చేరొచ్చు, విదేశాల్లో ఉద్యోగం కోసం వెళ్లొచ్చు. నూతన వాహనాలు కొనుగోలు చేయొచ్చు, నూతన వస్త్రాలు కొనుక్కోవచ్చు

👉మూఢాల కాలంలో శుభ కార్యాలు నిర్వహిస్తే ఏమవుతుంది ?

మహర్షులు, జ్యోతిష్య శాస్త్ర పండితులు, అనుభవస్తులు చెప్పిన దాని ప్రకారం మూఢం సమయంలో ఏదైనా శుభకార్యం చేసినా అశుభం వినాల్సి రావొచ్చు. కష్టం కలుగవచ్చు , నష్టం వాటిల్లవచ్చు. అందుకే మూఢం సమయంలో ఏ శుభకార్యం తలపెట్టరు.