J.SURENDER KUMAR,
నేను జైలులో పారాయణం చేసుకోవడానికి నాకు నరసింహ శతకం, గజేంద్రమోక్షం తోపాటు అనేక ఆంగ్ల పుస్తకాలు, కావాలని ఆమె తరఫు న్యాయవాది ఢిల్లీలో సిబిఐ స్పెషల్ కోర్టు జడ్జి ముందు సోమవారం పిటిషన్ దాఖలు చేశారు.
వివరాల్లోకి వెళ్తే..

ఢిల్లీ లిక్కర్ కుంభకోణంతో సంబంధాలు ఉన్నాయి అనే ఆరోపణలతో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ను ఈడి అధికారులు హైదరాబాదులో అరెస్టు చేసి ఆమెను ఢిల్లీకి తరలించిన విషయం తెలిసిందే. ఈడి కార్యాలయంలో కొన్ని రోజుల పాటు విచారణ చేసి సిబిఎస్ స్పెషల్ కోర్టులో ప్రవేశపెట్టగా కోర్ట్ ఆమెను తిహారి జైలుకు పంపి ఏప్రిల్ 9 వరకు జ్యూడిషల్ రిమాండ్ విధించిన విషయం తెలిసిందే.
సోమవారం మధ్యంతర, రెగ్యులర్ బెయిల్ కోసం. సిబిఐ స్పెషల్ కోర్టు న్యాయమూర్తి కావేరి బజాజ్ ముందు కవిత తరఫున న్యాయవాది, ప్రముఖ న్యాయవాది సతీష్ రానా, జైల్లో ఎమ్మెల్సీ కవితకు కావలసిన సదుపాయాల గురించి పిటిషన్ దాఖలు చేశారు.

అందులో జపమాలతో పాటు దుప్పట్లు, బూట్లు పలు ఆంగ్ల, హిందీ, తెలుగు పుస్తకాలు కావాలి అనుమతి ఇవ్వాలని పిటిషన్ లో పేర్కొన్నారు. ఎమ్మెల్సీ కవిత కోరిన పుస్తకాలలో నరసింహ శతకం, గజేంద్రమోక్షం, ఉన్నాయి.
👉నరసింహ శతకం…

వందలాది సంవత్సరాల నుండి ధర్మపురి లో నరసింహ శతకం, ప్రజలు నానుడిలో కొనసాగుతున్నది. ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో నరసింహ శతకం వీధి బడులలో తప్పనిసరిగా ఉండడంతో పాటు నాటి విద్యార్థులకు గురువులు నేర్పించి కంఠస్థం చేయించేవారు. ధర్మపురి ఆలయ కార్యనిర్వహణాధికారిగా 1980 లో విధులు నిర్వహించిన ఆంధ్ర ప్రాంతానికి చెందిన వీరభద్ర శర్మ , కవిశేషప్ప రచించిన ‘నరసింహ శతకం’ ధర్మపురికి , ధర్మపురి లోని శ్రీ నరసింహ ఆలయానికి చెందినదని. ఆయన నాడు నరసింహ శతకాన్ని పుస్తకాన్ని ఆలయ పక్షాన ముద్రించారు.
నేటి కాలమాన పరిస్థితులు కనుగుణంగా వందలాది సంవత్సరాల క్రితమే కవి శేషప్ప నరసింహ శతకాన్ని ఆశువుగా నరసింహుడి ముందు పాడేవారని చరిత్ర. ఆయన వంశీయులు ‘ కాకుస్తం ‘ వారు ధర్మపురిలో నేటికీ ఉన్నారు. ప్రముఖ సాహిత్య వేత్త, సంస్కృత తెలుగు కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపాల్ డా.సంగనభట్ట నరసయ్య, నరసింహ శతక కర్త. కవి శేషప్ప జీవితంపై పరిశోధన చేసి పుస్తకాన్ని వెలువరించారు.
👉విగ్రహం పెట్టాలని కవిత కోరిక..

ధర్మపురి క్షేత్రంలో నరసింహ శతక కర్త కవి శేషప్ప విగ్రహం పెట్టాలని జాగృతి సంస్థ పక్షాన ఆమె ప్రయత్నించారు. స్థానిక 1975 SSC మిత్ర బృందం లక్షలాది రూపాయల వ్యయంతో ( విగ్రహ దాత రంగా అశోక్ ) ఆలయం ముందు ఏర్పాటు చేశారు.
👉అభినవ బ్రహ్మంగారు..
భవిష్యత్తు కాలమాన పరిస్థితులను శ్రీ బ్రహ్మం గారు కాలజ్ఞానంతో సమాజానికి వివరించినట్టు. కవి శేషప్ప నరసింహ శతకం ద్వారా అదే సంకేతాలను వందలాది సంవత్సరాల క్రితమే వ్యక్తం చేశారు. , ఉదాహరణ; తనయుడు దుష్టుడు అయినా తండ్రి తప్పు, కూతురు చెడు అయిన మాతా తప్పు, ప్రజలు దుర్జనులైన పరిపాలకుని తప్పు, తో పాటు కుటుంబ సభ్యుల సంబంధాలు వివాదరహితంగా కొనసాగాలని, ఉదా; ఆడబిడ్డల సొమ్ము అపరహించుటకంటే బండ కట్టుకొని నూతిలో పడుట మేలు ” భూషణా వికాస శ్రీ ధర్మపురి నివాస దుష్ట సంహార నరసింహ దురితదూర ” అనే మకుటంతో 100 పద్యాలను శేషప్ప రాశాడు.
👉సమస్యల పరిష్కారానికి.

మానసిక సమస్యలు, ఆర్థిక, శత్రుభాధలు, కుటుంబ కలహాలు, అనారోగ్య సమస్యలు స్వస్థత చేకూర్చుకోవడానికి. నేటికీ నరసింహ శతకం ఈ ప్రాంతంలో పారాయణం చేయడం షరా మామూలే. నయం కానీ వ్యాధిగ్రస్తులు శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో 41 రోజులు నిద్రిస్తుంటారు.
ప్రస్తుతం సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నరసింహ శతక పారాయణం కోసం పుస్తకం కావాలని సిబిఐ స్పెషల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం గమన హారం.