J.SURENDER KUMAR,
నాకు అండగా నిలువండి, నన్ను గెలిపించండి పార్లమెంట్ లో గళం ఎత్తుతా జగిత్యాలలో ఈ ఎస్ఐ ఆస్పత్రిని ఏర్పాటు చేస్తా గల్ఫ్ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తాం. నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎం పి అభ్యర్థి ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి అన్నారు.
బుధవారం జగిత్యాల పట్టణంలోని పొన్నాల గార్డెన్ లో బీడి కార్మికులు, టేకేదార్లు, కార్మికుల ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన నిజామాబాద్ కాంగ్రెస్ ఎంపి అభ్యర్థి జీవన్ రెడ్డి వారితో మాట్లాడారు కోరుట్ల నియోజక వర్గ ఇంఛార్జి జువ్వాడి నర్సింగ్ రావు మాట్లాడుతూ..పని చేసే నాయకుడు జీవన్ రెడ్డినీ గెలిపించి పార్లమెంట్ కు పంపించాలి..

ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ..
రాష్ట్ర మంత్రివర్గంలో జీవన్ రెడ్డి లేని లోటు కనపడుతుంది. మీ సమస్యలు నా సమస్యలుగా భావించి, గల్ఫ్ కార్మిక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయించి, అండగా నిలుస్తాను అని జీవన్ రెడ్డి హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో బీడీ టేకేదార్ల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తీగల వెంకట్, జిల్లా అధ్యక్షుడు మల్లా రెడ్డి జువ్వాడి నర్సింగ్ రావు, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, మాజీ ఛైర్పర్సన్ గిరి నాగభూషణం, దేశాయ్, ఎం పీ పీ మహేష్, మాజీ జెడ్పీటీసీ మాధవి, సతీష్ రాజ్, కళ్లేపల్లి దుర్గయ్య, ముక్రం, మొయిజొద్దిన్, జలపతి రెడ్డి, బండ శంకర్, కొత్త మోహన్, గుంటి జగదీశ్వర్, పుప్పాల అశోక్, తదితరులు పాల్గొన్నారు.