👉మంత్రి శ్రీధర్ బాబు సమావేశానికి రానున్నారు!
J.SURENDER KUMAR,
నియోజకవర్గ కేంద్రమైన ధర్మపురి పట్టణంలో గురువారం జరగనున్న పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల సన్నహాక సమావేశానికి మంత్రి శ్రీధర్ బాబు హాజరుకానున్నారు.
స్థానిక గోదావరి రెసిడెన్సీ ( శ్రీ లక్ష్మీనరసింహ గార్డెన్స్) లో ఉదయం 10 గంటలనుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ఎన్నికల సన్నాహక సమావేశం జరగనున్నది.

ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అధ్యక్షతన జరగనున్న సమావేశానికి పెద్దపల్లిఎమ్మెల్యే విజయ రమణ రావు, రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ , మంచిర్యాల్ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ , పార్లమెంట్ ఎంపి అభ్యర్థి వంశీ హాజరుకానున్నారు.