ఒంటిమిట్ట శ్రీ సీతారామ కళ్యాణానికి కోటి తలంబ్రాలు !

J.SURENDER KUMAR,

వొంటిమిట్టలో సోమవారం జరిగే శ్రీ సీతారామ కల్యాణానికి తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ శ్రీకృష్ణ చైతన్య సంఘం అధ్యక్షులు శ్రీ కల్యాణ అప్పారావు ఆదివారం కోటి తలంబ్రాలు సమర్పించారు.

180 కిలోల బరువున్న ఈ తలంబ్రాలను డిప్యూటీ ఈవో శ్రీ నటేష్‌బాబు, అర్చకుడు శ్రీ శ్రవణ్‌కుమార్‌ సమక్షంలో ఆలయానికి సమర్పించారు.ఈ తలంబ్రాలు కోసం ప్రత్యేకంగా ఆరు నెలల పాటు వరిసాగు చేయగా నాలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు మూడు నెలలపాటు భక్తిశ్రద్ధలతో వేలిముద్రలతో పొట్టు వేసి సిద్ధం చేశారు. శ్రీ కళ్యాణ అప్పారావు మాట్లాడుతూ ఈ సంఘం ఆధ్వర్యంలో గత 13 ఏళ్లుగా భద్రాద్రి రాముడికి, ఏడేళ్ల నుంచి వొంటిమిట్ట రాముడికి కల్యాణోత్సవం సందర్భంగా దర్శనం ఇస్తున్నామన్నారు.

ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్  హనుమంతయ్య, ఆలయ ఇన్‌స్పెక్టర్  నవీన్, ఇతర అధికారులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.