👉ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ !
J.SURENDER KUMAR,
పెద్దపల్లి పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థిగా గడ్డం వంశీకృష్ణ గెలుపు కోసం ప్రతి కార్యకర్త కృషి చెయ్యాలి అని ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ అన్నారు.
నియోజకవర్గ పరిధిలోని ధర్మారం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని మంగళవారం ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మండల నాయకులతో కలిసి ప్రారంభించారు.
మండలంలోని పలు గ్రామాలకు చెందిన వివిధ రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు లక్ష్యం కుమార్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మాట్లాడుతూ
ధర్మపురి నియోజక వర్గ ప్రజానీకానికి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు.
గత 15 సంవత్సరాలు గా ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించిన మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్ చేసింది ఏమీ లేదని ప్రజలు గుర్తించి ఓడించారు అని లక్ష్మణ్ కుమార్ అన్నారు. ఎంపి అభ్యర్థిగ పోటీ చేస్తు గడ్డం వంశిని, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ ను డబ్బులు ఉన్నవారని అనడం పద్ధతి కాదన్నారు. 2004 లో కొప్పుల ఈశ్వర్ ఆస్తులు ఎన్ని ? మొన్నటి అసెంబ్లీ ఎన్నికల వరకు ఉన్న ఆస్తులు ఎన్నో ? ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.

పంటలు ఎండి పోతున్నాయని, దొంగ దీక్షలు చేస్తున్న కొప్పుల ఈశ్వర్ ఈ సమస్యకు కారణం మీరు కాదా ? రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఏమి అభివృద్ధి చేసిందో భవిష్యత్తులో ఎటువంటి అభివృద్ధి చేస్తుందో ప్రజల ముందుకు తీసుకువెళ్తామని లక్ష్మణ్ కుమార్ అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
👉బుగ్గారం మండలంలో…

బుగ్గారం మండలం శేకెళ్ళ గ్రామంలో మహాదేవుని జాతరలో ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ పాల్గొని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం జాతర సందర్భంగా నిర్వహించిన ఎడ్ల బండ్ల పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు పంపిణీ చేశారు.

మండలంలోని చందయ్య పల్లె గ్రామంలో శ్రీ వేంకటేశ్వరస్వామి వారి జాతరలో పాల్గొని స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సుభాష్, ఉపాధ్యక్షుడు నర్సగౌడ్ మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.