పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశిని గెలిపిస్తాం!

👉ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్!


J.SURENDER KUMAR,

మంత్రి శ్రీధర్ బాబు నాయకత్వంలో పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని శాసనసభ్యులు కలిసికట్టుగా కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీని భారీ ఓట్ల మెజార్టీతో గెలిపిస్తామని ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ అన్నారు.


బుధవారం హైదరాబాదులో మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఇంట్లో, మంథని ఎమ్మేల్యే, మంత్రి , పెద్దపల్లి పార్లమెంట్ ఇంచార్జీ దుద్దిల్ల శ్రీధర్ బాబు సమక్షంలో పెద్దపల్లి పార్లమెంట్ నియోజక పరిధిలోని ఎమ్మేల్యేల హాజరైన మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మేల్యేలు ప్రేమ్ సాగర్ రావు, మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్, విజయ రమణ రావు, లక్ష్మణ్ కుమార్, వినోద్ వెంకటస్వామి, వివేక్ వెంకటస్వామి మరియు పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి శ్రీ వంశీ కృష్ణలు సమావేశమై చర్చించారు.

ఈ సందర్భంగా లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ..
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ముఖ్య భూమిక పోషించిన కుటుంబం వెంకట స్వామి కుటుంబమని, ఆ కుటుంబ నుండి ఆయన మనుమడు గడ్డం వంశీ ని పెద్దపెల్లి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పార్టీ హై కమండ్ నియమించడం జరిగిందనీ, వారి గెలుపు కోసం మంత్రివర్యులు శ్రీధర్ బాబు నాయకత్వంలో అందరూ కలిసి కట్టుగా పనిచేస్తామని, వారిని గెలిపించే బాధ్యత మా పైన ఉందని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.