రేపు హైదరాబాద్ రవీంద్రభారతిలో ప్రభుత్వ పక్షాన పంచాంగ శ్రవణం !

👉బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి తో..

J.SURENDER KUMAR.

శ్రీ క్రొది నామ సంవత్సరం ఉగాది పంచాంగ శ్రవణం ప్రముఖ ప్రవచకులు ధర్మపురి క్షేత్రానికి చెందిన డాక్టర్ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి చే. మంగళవారం హైదరాబాద్ రవీంద్ర భారతి లో జరగనున్నది.


ఉదయం 10 గంటలకు పంచాంగ శ్రవణ కార్యక్రమం ప్రారంభం కానున్నది. ఈ మేరకు రాష్ట్ర దేవాదాయ శాఖ ఈనెల 4న సంతోష్ కుమార్ శాస్త్రికి ముందస్తుగా సమాచారం ఇచ్చి ఆహ్వానించారు.