👉మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు..
J.SURENDER KUMAR,
భారతరాష్ట్ర సమితి ( బీఆర్ఎస్ ) రైతులను అడ్డుపెట్టుకొని
లబ్ధి పొందడానికి రాజకీయాలు చేయవద్దని ఐటి, పరిశ్రమల
మరియు శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
ప్రతిపక్ష పార్టీ నాయకులకు హితవు పలికారు.
పెద్దపల్లి జిల్లా కేంద్రంలో సోమవారం మంత్రి శ్రీధర్ బాబు,
మీడియా సమావేశంలో మాట్లాడారు. పెద్దపెల్లి ఎమ్మెల్యే
విజయ రమణారావు, రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్
మక్కా సింగ్ మీడియా సమావేశం పాల్గొన్నారు.
మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ..
👉 ఐదు సంవత్సరాలలోపు ప్రతిపాక రిజర్వాయర్ను పూర్తి చేస్తాం…
👉 రైతుల పేరిట ప్రతిపక్షాలు రాజకీయాలు చేయొద్దు..
👉 ప్రకృతి వైపరీత్యం వల్ల రాష్ట్రంలో కొంత పంట నష్టం జరిగితే పార్లమెంటు ఎన్నికల్లో లబ్ది పొందేందుకు బిఆర్ఎస్ రాజకీయం చేయడం సిగ్గుచేటు..
👉 అధికారంలో ఉన్న పది సంవత్సరాలపాటు రైతుల ను పట్టించుకోని కేసీఆర్ ఎంపీ సీట్ల కోసం దొంగ కన్నీరు కారుస్తున్నారూ..
👉 కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తుంది .
👉 టేలండ్ ప్రాంత రైతులు పంట నష్టపోకుండా ఉండేందుకు తమ ఎమ్మెల్యేలు కృషి చేస్తున్నారు..
👉 కాలేశ్వరం ప్రాజెక్టుతో మంథని ప్రాంతానికి చుక్క నీరు కూడా రాలేదు , మూడు పిల్లర్లు కుంగిపోయి ప్రాజెక్టు ఉనికికి ప్రమాదం ఏర్పడిందని ఈ పాపం గత ప్రభుత్వానిది కాదా అని ప్రశ్నించారు..
👉 రాష్ట్రంలో విద్యుత్ కొరత లేకుండా ఉండేందుకు గత ప్రభుత్వం ఫిబ్రవరి, మార్చ్ మాసాల్లో వినియోగించిన కరెంట్ కంటే ఎనిమిది శాతం అధికంగా కరెంటు కొనుగోలు చేసి మరీ సరఫరా చేస్తున్నాం..
👉 రాష్ట్రంలో ఎటువంటి విద్యుత్ కొరతలు లేవని, ప్రతిపక్షాలు అసత్యపు ప్రచారాలు చేస్తున్నాయని ప్రజలు నమ్మే పరిస్థితి లో లేరు …
.
👉 200 యూనిట్ల లోపు విద్యుత్ వాడుకున్న అర్హులైన ప్రతి ఒక్కరికి జీరో బిల్లు అందిస్తున్నాం .
👉 200 యూనిట్ల లోపు విద్యుత్ వాడుకున్న వినియోగదారులు బిల్లులు కట్టాల్సిన అవసరం లేదు.,
👉 ప్రకృతి వైపరీత్యం వల్ల కొంత పంట నష్టం జరిగిందని, నిజంగా పంట నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకుంటుంది..
👉 ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను తమ ప్రభుత్వం పక్కాగా అమలు చేస్తుంది..
👉 ఉచిత బస్సు ప్రయాణంలో భాగంగా ఇప్పటికే 35 కోట్ల ఫ్రీ టికెట్లు జారీ చేశాం…
👉 ₹500 రూపాయలకే సిలిండర్ అందిస్తున్నాం..
👉 ఆరోగ్యశ్రీని ₹10 లక్షల రూపాయలకు పెంచాం..
👉 పెద్దపెల్లి జిల్లాలో ₹ 15 కోట్ల రూపాయల వైద్య సేవలను ప్రజలు వినియోగించుకున్నారు…
👉 ఎన్నికల తర్వాత పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడతామని ఆరు గ్యారెంటీలో ప్రతి పథకానికి పూర్తిస్థాయిలో నిధులు కేటాయిస్తాం..
👉 ఫోన్ టాపింగ్ అతిపెద్ద నేరమని, చట్టానికి ఎవరూ అతీతులు కారని తప్పు చేసిన వారు శిక్ష అనుభవించక తప్పదు..
👉 మేము ఆరోపిస్తే కాంగ్రెస్ ఆరోపిస్తుందని గగ్గోలు పెడతారని, కానీ బారాస పార్లమెంటు అభ్యర్థి కడియం కావ్య, లిక్కర్ స్కాం, ఫోన్ టాపింగ్ ఇతర అవినీతి ఆరోపణలపై ప్రజలకు జవాబు చెప్పలేకపోతున్నామని పోటీ నుండి తప్పుకొని కాంగ్రెస్ పార్టీలో చేరారు. అని అన్నారు.