సైనికులకు మావోయిస్టులకు మధ్య భారీ ఎన్‌కౌంటర్!

👉15 మంది మావోయిస్టుల మృతి?

👉మృతుల్లో మావోయిస్టు కీలక నేత శంకర్రావు ?

J.SURENDER KUMAR,

చత్తీస్గడ్ రాష్ట్రంలోని కంకేర్‌లోని ఛోటే బైథియా పోలీస్ స్టేషన్‌లోని కల్పర్ అడవిలో సైనికులకు మావోయిస్టులకు మధ్య మంగళవారం మధ్యాహ్నం నుంచి భారీ ఎన్‌కౌంటర్ జరుగుతున్నది.

ఎన్కౌంటర్ జరుగుతున్న ప్రదేశం.


ఎన్‌కౌంటర్‌లో దాదాపు పది నుంచి పదిహేను మంది మావోయిస్టులు హతమైనట్లు వార్తలు వస్తున్నాయి ఘటనా స్థలం నుంచి ఏకే47తో పాటు, ఇన్సాస్ రైఫిల్ కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది

ఎన్‌కౌంటర్‌ లో ఇన్‌స్పెక్టర్‌ తోసహా, ఇద్దరు బీఎస్‌ఎఫ్ జవాన్లు కూడా గాయపడ్డారు. ఎన్‌కౌంటర్‌లో మరణించిన నక్సలైట్ల సంఖ్యను నిర్ధారించలేదు.


👉ఎన్కౌంటర్ జరుగుతున్నది. ఎస్పీ

ఎన్‌కౌంటర్‌ను ఎస్పీ ఇంద్ర కళ్యాణ్ ఐలెసెల ధృవీకరించారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. DRG మరియు BSF సైనికులతో నక్సలైట్లు ఎన్‌కౌంటర్ చేశారు డజను మంది హతమయ్యారు, ఘటనా స్థలం నుంచి ఆయుధాలు కూడా స్వాధీనం చేసుకున్నారు సైనికులు ఇంకా అక్కడికక్కడే వెతుకుతున్నారు


మృతుల మావోయిస్టుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఎస్పీ తెలిపిన వివరాలిలా ఉన్నాయి.


కొత్రీ నది సమీపంలో సైనికులు మరియు మావోయిస్టుల మధ్య ఎన్‌కౌంటర్ కల్ప అడవుల్లో జరిగింది అని ఎస్పీ ధృవీకరించారు. మృతుల్లో కీలక నేత శంకర్రావు ఉన్నట్టు అతడిపై ప్రభుత్వం 25 లక్షల రివార్డు ఉన్నట్టు సమాచారం. పూర్తి సమాచారం వివరాలు తెలియాల్సింది.