శ్రీరాముడు సమాజానికి ఆదర్శప్రాయుడు ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ !

👉అన్నదానానికి లక్ష రూపాయలు విరాళం ఇచ్చిన ఎమ్మెల్యే!

J.SURENDER KUMAR,

శ్రీరామచంద్రమూర్తి మానవ సమాజానికి, ఆదర్శప్రాయుడని, తండ్రి మాట జవదాటని తనయుడిగా, ఏకపత్నివతుడిగా, ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా రాజ్యపాలన చేసిన ఆదర్శ మూర్తి శ్రీరాముడని ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్డూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

శ్రీ రామనవమి సందర్భంగా బుధవారం ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ . నియోజకవర్గంలో రామాలయాలు శ్రీరామ కళ్యాణ మహోత్సవాలు ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ధర్మపురి మండలం దొంతపూర్ లో శ్రీరామ కళ్యాణ మహోత్సవ సందర్భంగా జరిగిన అన్నదాన కార్యక్రమానికి తనవంతుగా ఎమ్మెల్యే లక్ష రూపాయలు నిర్వాహకులకు విరాళంగా ఇచ్చారు.


ధర్మపురిలోని గోదావరి తీరంలో గల రామాలయంలో స్వామి వారిని దర్శించుకున్నారు. నరసయ్య పల్లి, శ్రీ లక్ష్మీనరసింహ కాలనీ, స్థానిక అక్కపెల్లి శ్రీ రాజరాజశ్వర స్వామి దేవాలయం నుండి శ్రీ రామ శోభాయాత్రను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా నియోజక వర్గ ప్రజానికానికి రామనవమి శుభాకాంక్షలు తెలిపారు. స్వామి వారి ఆశీస్సులు ఎల్లవేళల ధర్మపురి నియోజక వర్గ ప్రజానికం పై ఉండాలనీ కోరుకుంటున్నట్లు తెలిపారు.


ధర్మపురి మండలంలోని ధర్మపురి, దమ్మన్నపేట, రాజారం, జైన, దొంతపూర్, తీగలధర్మారం గ్రామాల్లో గల రామలయాలను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సంగనబట్ల దినేష్, ఉపాధ్యక్షులు వేముల రాజేష్, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ప్రసాద్, చిలుముల లక్ష్మణ్, అశేట్టి శ్రీనివాస్, NSUI అసెంబ్లీ అధ్యక్షులు శ్రవణ్, సుముక్, నరేందర్, వొజ్జల లక్ష్మణ్, రవీందర్, రమణ,నిరంజన్ తదితరులు పాల్గొన్నారు.
👉ధర్మారం లో..


శ్రీ రామనవమి సందర్భంగా ధర్మారం మండల కేంద్రంలోని రామలయాన్ని ఎమ్మెల్యే దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం భవాని కమ్యునికేషన్ ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రారంభించారు.


ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
👉గొల్లపల్లిలో..


గొల్లపెల్లి మండల కేంద్రంలోని రామ మందిరాన్ని ఎమ్మెల్యే సుదర్శించుకునే ప్రత్యేక పూజలు చేశారు.
👉ఆస్పత్రి ప్రారంభం..


జగిత్యాలలో నూతన స్టార్ మల్టి స్పెషాలిటీ హాస్పటల్ ని ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ ప్రారంభించి, యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు.


ఈ కార్యక్రమలలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.