👉భరణి నక్షత్రం సందర్భంగా…
J.SURENDER KUMAR,
ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో గల
శ్రీ యమధర్మరాజు అనుబంధ ఆలయంలో బుధవారం వేద
పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
”భరణి” నక్షత్రంను పురస్కరించుకుని శ్రీయమధర్మరాజు
స్వామివారికి రుద్రాభిషేకం, మన్య సూక్తం, ఆయుష్య సూక్తం
తో అబిషేకం , ఆయుష్షు హోమం, హరతి, మంత్రపుష్పం
లాంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో వేదపండితులు బొజ్జ రమేష్ శర్మ , పాలెపు ప్రవీణ్ కుమార్ శర్మ , అర్చకులు ప్రదీప్ కుమార్ , నేరెళ్ల సంతోష్ కుమార్, వొద్దిపర్తి కళ్యాణ్, కార్యనిర్వహణాధికారి సంకటాల శ్రీనివాస్ , సూపరింటెండెంట్ కిరణ్ , సీనియర్ అసిస్టెంట్ అలువాల శ్రీనివాస్, అభిషేకం పురోహితులు బొజ్జ సంతోష్ కుమార్, సంపత్ కుమార్ , రాజగోపాల్ మరియు సిబ్బంది,. భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
