👉శ్రీ క్రోది నామ సంవత్సరలో..
👉పంచాంగకర్త ; బుగ్గారపు ప్రసాద్ జోషి..
J.SURENDER KUMAR,
తెలంగాణా రాష్ట్రమునకు శని మహాదశలో శుక్ర భుక్తి నడుస్తున్నది .
ప్రజా సంక్షేమ పధకములకు నిధుల కొరత ఉన్న ముందుకు కోనసాగుతాయి, జూలై మాసము నుండి ప్రభుత్వ పనులకు అంతరాయములు తోలగి సంక్షేమ పధకములు ముందుకు కొనసాగుతాయి.
వర్తమాన ప్రభుత్వమునకు కీర్తి పెరిగి ముందుకు సాగుతుందని పంచాంగ కర్త బుగ్గారపు ప్రసాద్ జోషి వివరించారు.

ఉగాది పర్వదినమును పురస్కరించుకొని ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో శేషప్ప కళావేదికపై ఆలయ వంశపార్యంపర పంచాంగ ప్రవచకులు బుగ్గారపు వంశస్థులు ప్రసాద్ జోషి క్రోధి పంచాంగ శ్రవణము చేశారు. ఈ సందర్భంగా ఆయన శ్రీ క్రోధి నామ సంవత్సర ఫలాలను వివరించారు.
ఈ సంవత్సరం రాష్ట్రంలో సాదారణమైన వర్షము కురుస్తుందని, రైతులకు ప్రభుత్వ పరముగా మేలు జరిగినా, ప్రకృతి విపత్తులచే పంట నష్టాలు సంభవిస్తాయని. . విద్యుత్, విద్య ,ఆదాయ, రవాణా, పోలీస్ శాఖలలో మార్పులు. రియల్ ఎస్టేట్ రంగము కొంత పుంజుకుంటుంది అన్నారు. విద్యుత్ రంగములలో పురోగతి నూతన సంస్కరణలు, నూతన సంక్షేమ పథకలు, అమలు జరుగుతాయి.

పండితులకు – కళాకారులకు సన్మాన – సత్కారములు. అనుకూలమైన వాతావరణము రైతులకు మేలు చేయును, కేంద్ర ప్రభుత్వంతో మరియు పొరుగు రాష్ట్రములతో దౌత్యములు ఫలించును. రాష్ట్ర ఆదాయం పెరుగును, చలనచిత్ర ప్రముఖులకు – కళాకారులకు గడ్డుకాలం. ప్రభుత్వం నూతన విద్యా సంస్కరణలు అమలు చేయనున్నది అన్నారు. నూతన వ్యాపార పారిశ్రామిక వ్యవసాయ రంగములు అభివృద్ధి లో పయనిస్తుందని ప్రసాద్ జోషి వివరించారు.
👉ఆలయ పక్షాన పలువురికి సన్మానం !

ఉగాది పర్వదినం పండుగ పురస్కరించుకొని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ పక్షాన వివిధ కళల యందు నిష్ణాతులైన కొరిడె నరహరి శర్మ (పురాణం)

కొరిడె శంకర్ (సంగీతం) గుండి రాంకుమార్ (సాహిత్యం) శ్రీమతి డా॥ గోలి శ్రీలత (సాహిత్యం) మరియు బుగ్గారవు రాజేంద్రప్రసాద్, వంచాంగకర్త ఉగాది పురస్కారము అందించి సన్మానించారు.



ఈ కార్యక్రమములో కార్యనిర్వహణాధికారి సంకటాల శ్రీనివాస్ , దేవస్థాన వేదపండితులు బొజ్జ రమేష్, పాలెపు ప్రవీణ్ కుమార్ శర్మ, ఉప ప్రధాన అర్చకులు నేరళ్ళ శ్రీనివాసాచార్యులు, స్థానిక వేదపండితులు కొరిడె చంద్రశేఖర్ శర్మ, పణతు ల వెంకటరమణ, ముఖ్య అర్చకులు నంబి శ్రీనివాసాచార్యులు, అర్చకులు నంబి నర్సింహమూర్తి, బొజ్జ సంతోష్ కుమార్, బొజ్జ సంపత్ కుమార్, బొజ్జ రాజగోపాల్, సూపరింటెండెంట్ డి.కిరణ్, సీనియర్ అసిస్టెంట్ ఎ.శ్రీనివాస్ మరియు ఇతర అర్ధ్చక & సిబ్బంది పాల్గొన్నారు.