👉ఎమ్మెల్యే అడ్డూరి లక్ష్మణ్ కుమార్ !
J.SURENDER KUMAR,
తాను ధర్మపురి ఎమ్మెల్యే గా ఉన్న పదవి కాలంలోపే నీటి రిజర్వాయర్ ఏర్పాటు చేసి ధర్మపురి నియోజకవర్గంను సస్యశ్యామలం చేస్తాను అని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. శుక్రవారం ఆయన క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు.
రేపు (శనివారం ) తుక్కుగూడ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆద్వర్యంలో జరగనున్న బహిరంగ సభకు ధర్మపురి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పార్టీ శ్రేణులు భారీగా తరలి రావాలని లక్ష్మణ్ కుమార్ విజ్ఞప్తి చేశారు.
రైతు సమస్యల పేరిట 31 గంటల దీక్ష లో పాల్గొన్న మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ధర్మపురి రైతాంగం గురించి,వారికి సాగు నీరందించే విషయం గుర్చి కనీసం ఎప్పుడైనా 31 నిమిషాలైనా ఆలోచించారా ? అంటూ లక్ష్మణ్ కుమార్ ప్రశ్నించారు.
మీడియా సమావేశ ముఖ్యాంశాలు..
👉వర్షపాతం తక్కువగా నమోదు కావడం SRSP, ఎల్లంపెల్లి లో నీటిమట్టం తక్కువగా ఉండటం వల్ల రైతులకు సాగు నీరు అందించే విషయంలో సమస్యలు వచ్చాయన్నారు.
👉గత 10 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న BRS పార్టీ ధర్మపురి కి శాశ్వత మంచి నీటి పరిష్కారం ఎందుకు చూపించలేదని ప్రశ్నించారు.
👉10 సంవత్సరాలు అధికారంలో ఉన్న మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పెద్దపెల్లి లో 31 గంటల దీక్ష ఎందుకు చేశారు అంటూ ప్రశ్నించారు.
👉కాళేశ్వరం లింక్ 2 పేరుతో మన ప్రాంత నీటిని సిరిసిల్ల, సిద్దిపేట కు తరలిస్తున్న మంత్రి హోదాలో కొప్పుల ఈశ్వర్ ఎందుకు స్పందించలేదు అని ప్రశ్నించారు.
👉2016 లో ప్రారంభించిన రోల్లవాగు ప్రాజెక్ట్ వరకు పూర్తి కాలేదు, అక్కపెల్లి చెరువు రి డిజైనింగ్ పేరు చెప్పి పాలాభిషేకాలు చేయించుకున్న విషయం గుర్తు చేశారు.
👉 గత ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధులు నియోజకవర్గంలో ఉన్న లిఫ్ట్ ల మెయింటెనెన్స్ గురించి ఏ రోజున ఆలోచించలేదు
👉ధర్మపురి పట్టణానికి కి తలాపున గోదావరి నది ఉన్న పట్టణ ప్రజలు త్రాగు నీటి కోసం 50 కిలో మీటర్ల దూరంలో ఉన్న డబ్బా పై ఆధారపడాల్సి వస్తుంది ఆరోపించారు.
👉పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి కెసిఆర్ ఎంత మంది రైతుల అకౌంట్లో డబ్బుకు జమ చేశారు అంటూ ప్రశ్నించారు.
👉ధర్మపురి నియోజకవర్గ ప్రాంత నీటి సమస్యలను తాత్కలికంగా పరిష్కరించేందుకు జిల్లా కలెక్టర్ వద్ద ₹ 1.80 కోట్ల రూపాయలు ఉన్నాయన్నారు.
👉 వరి ధాన్యం కొనుగోలు విషయంలో మిల్లర్లు రైతులను ఇబ్బందులకు గురి చేస్తే, మంత్రి హోదాలో కొప్పుల ఈశ్వర్ కనీసం స్పందించలేదు అని ఆరోపించారు. 10 సంవత్సరకాలంలో ఎంత మంది రైతు కుటుంబాలను మాజీ మంత్రి మంత్రి కొప్పుల ఈశ్వర్ పరామర్శించారో చెప్పాలి డిమాండ్ చేశారు.
👉 ప్రస్తుత కొనుగోలు చేస్తున్న వరి ధాన్యం విషయంలో మిల్లర్లు ఎవరైనా రైతులను ఇబ్బందులకు గురి చేస్తే వెంటనే అధికారుల దృష్టికి తీసుకెళ్లండి వెంటనే అట్టి సమస్యలను పరిష్కారం చేస్తాం. అన్నారు.
👉ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు నీరు అందించక రైతులను మోసం చేసింది మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్
👉హరీష్ రావు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వ నాయకులతో ఎంత టచ్ లో ఉన్నారో వారి ఫోన్ చెక్ చేస్తే తెలుస్తుంది.
మీడియా సమావేశంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.