తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి!


J.SURENDER KUMAR,

ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి ఆదివారం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకుని  పూజలు చేశారు.

శ్రీవారి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదశీర్వచనం చేశారు. అనంతరం ఆయనకు టిటిడి ఈవో  ఎవి ధర్మారెడ్డి శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు.

ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈఓ  లోకనాథం తదితరులు పాల్గొన్నారు.