J.SURENDER KUMAR,
నా ఊపిరి ఉన్నంతవరకు నేను మన దళిత జాతి సోదరుల ఉన్నతికి కృషి చేస్తూ సమస్యల సాధనకు రాజీలేని పోరాటం చేస్తాను అని ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
ధర్మపురి నియోజకవర్గ మాదిగ సంఘ నాయకులు, కార్యకర్తల ఆద్వర్యంలో సోమవారం ధర్మపురి లోని SH గార్డెన్స్ లో ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ కు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసి, ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మాట్లాడుతూ.
తన పై ప్రేమ అభిమానంతో సన్మానం చేసిన మాదిగ జాతికి ధన్యవాదాలు తెలిపారు.
ఈ ప్రాంత సమస్యల పరిష్కారం, అభివృద్ధి పనులకు నిధులు మంజూరు, సాగు తాగునీటి అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని స్వయంగా పది నుండి పదిహేను సార్లు కలసి వివరించానన్నారు. తాను జెడ్పీ చైర్మన్ గా ఉన్న సమయంలో ప్రతి దళిత సర్పంచ్ లను పిలిచి గ్రామాభివృద్ధి నిధులు అంశం, సమస్యలను తెలుసుకున్నాను అని అన్నారు. 15 సంవత్సరాలు తన గెలుపుకు కృషి చేసిన ప్రతి దళిత బిడ్డలకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని అన్నారు.

తనను ఎమ్మెల్యే గా బావించవద్దని, మీ కుటుంబ సభ్యుడిగా భావించాలని, ఎవరికి ఎటువంటి సమస్య ఉన్న తనని నేరుగా కలిసి తమ సమస్యలు చెప్పుకోవచ్చని ఈ సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో కార్యా నిర్వాహక బాధ్యులు సంఘనబట్ల దినేష్, చిలుముల లక్ష్మణ్, పారపెళ్లి రాజమల్లయ్య, అరికిల్ల సతీష్, దీకొండ మహేందర్, మొకేనాపెల్లి సతీష్, ముల్కల శ్రీనివాస్, ఎదుల్ల అంజన్న, చందోలి శ్రీనివాస్, చెవులమద్ది రమేష్, చెవులమద్ది వినోద్, చిర్ర లక్ష్మణ్, రాయిళ్ల రవికుమార్, బొల్లారపు పోచన్న, చెన్న కుమార స్వామి మరియు పలు మండలాల నాయకులు తదితరులు పాల్గొన్నారు