J.SURENDER KUMAR,
మత సామరస్యానికి కుల మతాలకతీతంగా పల్లెలు పట్టు కొమ్ములుగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. శ్రీరామనవమి పర్వదినం రోజున మతసామరస్యం వెళ్లి విరిసింది. రామ్ రహీమ్ ఏక్ హై నినాదమే కాదు. ప్రత్యక్ష నిదర్శనం గా శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా శ్రీరామ కళ్యాణంలో హిందూ ముస్లింలు కలిసి పాల్గొన్నారు.
వివరాలు ఇలా ఉన్నాయి
ధర్మపురి నియోజకవర్గం దొంతపూర్ గ్రామంలో శ్రీరామ ఆలయంలో అంగరంగ వైభవంగా జరుగుతున్న శ్రీరాముడి కళ్యాణ మహోత్సవానికి స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు.

ఆయనతో పాటు ముస్లిం సోదరులు సైతం కళ్యాణ వేదిక వద్ద ఆసీనుడే శ్రీరామచంద్రమూర్తి కళ్యాణ మహోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో తిలకించారు. కులమతాలకతీతంగా శ్రీరామకళ్యాణ మహోత్సవములు పాల్గొనడంతో పలువురు భక్తజనం వర్షం వ్యక్తం చేస్తున్నారు.