J.SURENDER KUMAR,
తిరుమల లో జరుగుతున్న వార్షిక వసంతోత్సవం లో రెండో రోజు శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీ మలయప్ప స్వర్ణరథం పై ఊరేగించారు.
సోమవారం ఉదయం 8 నుంచి 10 గంటల మధ్య మాడ వీధుల్లో జరిగిన ఊరేగింపులో భక్తుల గోవింద నామ స్మరణలతో మాడవీధులు ప్రతిధ్వనించాయి. టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి, డీవైఈవో లోకనాథం తదితరులు పాల్గొన్నారు.

👉రేపు స్వామి వారి పౌర్ణమి గరుడ సేవ రద్దు!
👉ఘనంగా స్నపన తిరుమంజనం!

వసంతోత్సవం సందర్భంగా ఏప్రిల్ 23న తిరుమలలో నిర్వహించే పౌర్ణమి గరుడసేవను టీటీడీ రద్దు చేసినట్లు ప్రకటనలో పేర్కొంది.
తిరుమలలో వార్షిక వసంతోత్సవాల్లో భాగంగా సోమవారం సాయంత్రం 2 గంటల నుంచి 4 గంటల మధ్య శ్రీ మలయప్ప స్వామివారికి, భార్యాభర్తలకు స్నపన తిరుమంజనం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి, ఈఓ శ్రీ. AV. ధర్మారెడ్డి దంపతులు, ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, ఇతర అధికారులు పాల్గొన్నారు.