J.SURENDER KUMAR,
ప్రమాదాలు, అనారోగ్య భారీన పడిన వారి ప్రాణాలు కాపాడడానికి ఎనలేని సేవలు అందిస్తున్న వైద్యులు ప్రత్యక్ష దేవుళ్ళు అని ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ అన్నారు.

జగిత్యాల పట్టణ లో శ్రీ పావని క్రిటికల్ కేర్ మల్టి స్పెషాలిటీ హాస్పిటల్ ని బుధవారం ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తో కలిసి లక్ష్మణ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వైద్యం వైద్య సేవల గురించి మాట్లాడారు.
👉శ్రీ లక్ష్మీ నరసింహుడి కళ్యాణంలో….

ధర్మారం మండలం పత్తిపాక లో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవాలయాన్ని సందర్శించి, స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.

👉బీరయ్య పట్నాలలో..

పెగడపెల్లి మండలం మద్దులపల్లె, నంచర్ల గ్రామాల్లో జరుగుతున్న బీరయ్య స్వామి వారి పట్నాల మహోత్సవంలో భాగంగా బుధవారం బీరయ్య స్వామి వారి కళ్యాణోత్సవంలో ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
👉ఎల్లమ్మ పట్నాలలో….

ధర్మారం మండలం బొట్ల వనపర్తి లో నిర్వహిస్తున్న ఎల్లమ్మ తల్లి పట్నాలు మరియు బోనాల మహోత్సవంలో ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.