J.SURENDER KUMAR,
ఆదివాసి హక్కుల పోరాట సంఘీభావ వేదిక సభ్యులను పోలీసులు భద్రాచలం పోలీస్ స్టేషన్ కు తరలించివారిని వెంటనే వారిని విడుదల చేయాల్సిందిగా పౌర హక్కుల సంఘం, AP. రాష్ట్ర కమిటీ సహాయ కార్యదర్శి, ఎల్లంకి
వెంకటేశ్వర్లు , ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నారు.
ఛత్తిసఘడ్ వెళుతున్న పౌర హక్కుల సంఘం నిజానిర్ధారణ బృందాన్ని ప్రభుత్వం అడ్డుకోవడాన్ని ఖండించండి.. నిజాలు తెలుసు కోవడం నేరమా ?… ఛత్తిసఘడ్ భారత దేశంలో భాగం కాదా ? ఛత్తీస్ ఘడ్ రాష్ట్రం లో ఆదివాసీలను , మావోయిస్టులను, ఆపరేషన్ కగార్ పేరుతొ గత జనవరి 1 నుండి మారణహోమం జరుగుతున్న ప్రాంతాలకు నిజనిర్ధారణ కు వెళ్ళడానికి కొంతకాలంగా CDRO, మరియు, పౌరహక్కుల సంఘాలు ప్రయత్నం చేస్తున్నాయి.

మే 30న గురువారం 52మందితో కూడిన నిజనిర్ధారణ బృందం ఛత్తీస్ ఘడ్ లోని దండకారణ్యానికి వెళ్లేందుకు బయలుదేరింది. తెలంగాణ నుండి కుంట మార్గంలో పోతూండగా మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో కుంట వద్ద CRPF బలగాలు నిజ నిర్ధారణ బృంద వాహనాన్ని అడ్డుకుంది. ఈ వాహనంతో పాటు అటుగా పోతున్న వందలాది వాహనాలను నిలిపివేసింది. పైన మావోయిస్టుల బంద్ జరుగుతోందనీ, అటుగా వెళ్ళే వాహనాల భద్రత దృష్ట్యా ఆపివేస్తున్నామనీ చెప్పి ప్రయాణికుల్లో గందరగోళాన్ని క్రియేట్ చేసారు.
ఎలాగైనా ఛత్తీస్ ఘడ్ లోకి పోవాలని మరో మార్గాన్ని ఎంచుకోవడం జరిగింది. 30వ తేది రాత్రి 11 గంటల సమయంలో మళ్ళీ ఛత్తీస్ ఘడ్ బీజాపూర్ కు 40 కి.మీ దూరంలో తారగూడ వద్ద CRPF ఆపివేసింది. పైన మావోయిస్టులతో ఎన్ కౌంటర్ జరుగుతోంది. కాబట్టి పోవడానికి లేదనీ మరో కట్టుకథ అల్లింది. నిరసనగా బృందం రోడ్డుపై బైఠాయించింది.

ప్రజాస్వామిక వాదులు, ప్రజాసంఘాల ఈ విషయంలో సీరియస్ గా ప్రతిస్పందించాలని విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు.