బాధిత కుటుంబాలను పరామర్శించిన ధర్మపురి ఎమ్మెల్యే సతీమణి !

J.SURENDER KUMAR,

ధర్మపురి నియోజకవర్గ లో పలు బాధిత కుటుంబాలను  ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ సతీమణి  కాంతా కుమారి శనివారం పరామర్శించారు. వెల్గటూర్ మండలం ముత్తునూర్ గ్రామానికి చెందిన మోకెనపెల్లి రాజయ్య  ఇటీవల మృతి చెందగా వారి కుటుంబ సభ్యుల ను కాంతా కుమారి పరామర్శించి  వారికి ₹10 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు.


👉
పరామర్శ..

వెల్గటూర్ మండలం ముత్తునూర్ గ్రామానికి చెందిన సంగ రాజయ్య   కాలుకు శస్త్ర చికిత్స జరిగింది. ఎమ్మెల్యే సతీమణి ఆయనను పరామర్శించారు.


👉 పరామర్శ…

వెల్గటూర్ మండలం మారేడుపల్లి గ్రామానికి చెందిన తనుగుల  రామయ్య  ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. వారి కుటుంబాన్ని  కాంతా కుమారి పరామర్శించి ఓదార్చారు.


👉 బహుమతి ప్రధానోత్సవంలో..

గొల్లపెల్లి మండలం బి.బి.రాజ్ పల్లి గ్రామంలో  పాత్రికేయుడు బొమ్మెన కుమార్  ఆద్వర్యంలో జరిగిన క్రికెట్, వాలీబాల్, ముగ్గుల పోటీలకు సంబందించిన బహుమతుల ప్రదానోత్సవ  కార్యక్రమంలో  ముఖ్యఅతిథిగా కాంతా కుమారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోటీల్లో విజేతలుగా నిలిచిన జట్టు సభ్యులకు నగదు బహుమతితో పాటు ట్రోఫీలని అందజేశారు..