సీఎం సభను విజయవంతం చేయండి వంశీ కృష్ణ ను గెలిపించండి !

👉ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ సతీమణి కాంత కుమారి !


J.SURENDER KUMAR,

ధర్మపురి నియోజకవర్గ ఎండపల్లి మండలం రాజారాం పల్లిలో శుక్రవారం జరగనున్న సీఎం రేవంత్ రెడ్డి భారీ సభ ను విజయవంతం చేయడంతో పాటు, పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ ను భారీ ఓట్ల మెజార్టీతో గెలిపించాలని. స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ సతీమణి కాంత కుమారి విజ్ఞప్తి చేశారు.


పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ కు మద్దతుగా ప్రచార కార్యక్రమంలో భాగంగా ఆమె గురువారం ఎండపెల్లి మండలం ముంజమ్ పల్లె, మారేడు పల్లి, పాత గూడూరు గ్రామాల్లో గడప గడపకు ప్రచారం చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రవేశ పెట్టిన ఆరు గ్యారెంటీల ను ప్రజలకు వివరిస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా సంక్షేమం కోసం ఎనలేని కృషి చేస్తున్నది అని అన్నారు.

ఉచిత బస్సు ప్రయాణం, ₹ 500 కు సిలిండర్, విద్యుత్తు సబ్సిడీ, గృహజ్యోతి, ఆరోగ్యశ్రీ పరిధి ₹10 లక్షల కు పెంచడం, తదితర సంక్షేమ పథకాలను ఆమె ఓటర్లకు వివరించారు.


ఆయా గ్రామాల శివారు ప్రాంతాల్లో పనిచేస్తున్న ఉపాధి హామీ కూలీల వద్దకు కాంత కుమారి వెళ్లి ప్రభుత్వ చేపడుతున్న సంక్షేమ పథకాలు వారికి వివరించడంతో పాటు, ఉపాధి కూలీ ₹ 200/- రూపాయల నుంచి ₹ 400/- ప్రభుత్వం పెంపుదల చేసిన విషయాన్ని ఆమె వివరించారు.

గడ్డం వెంకటస్వామి ( కాక) స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చిన. యువకుడు, విద్యావేత్త, పారిశ్రామికవేత్త, గడ్డం వంశీకృష్ణ కు మన అండదండలు ఉండాలని విజ్ఞప్తి చేశారు.


ఈనెల 13న జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో చేతి గుర్తుకు ఓటు వేసి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ ను భారీ ఓట్ల మెజారిటీ గెలిపించాలని ఆమె ఉపాధి హామీ కూలీలను అభ్యర్థించారు. ఎమ్మెల్యే సతీమణి కాంత కుమారి వెంట మహిళా కాంగ్రెస్ నాయకులు, శ్రేణులు ప్రచారంలో పాల్గొన్నారు.