గెలుపు బాటలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి ?

👉కాంగ్రెస్ వైపు మొగ్గు చూపిస్తున్న గల్ఫ్ కార్మిక కుటుంబాలు!


J.SURENDER KUMAR,

రాజకీయ దిగ్గజం, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ, ప్రస్తుతం

నిజామాబాద్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి తాటిపర్తి జీవన్ రెడ్డి

గెలుపు బాటలో ఉన్నట్టు చర్చ మొదలైంది. నాలుగు దశాబ్దాల

రాజకీయ చరిత్రలో ఓడి నా, గెలిచినా, ప్రజల తోనే ఉంటూ

ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడే నాయకుడిగా జీవన్ రెడ్డి

అనేది జగమెరిగిన సత్యం.

నాలుగు దశాబ్దాల రాజకీయ చరిత్రలో ప్రజలతో, ప్రజా ప్రతినిధులతో, ప్రత్యర్థి రాజకీయ పార్టీల నాయకులతో గౌరవంగా మాట్లాడడం, రాజకీయాలకతీతంగా స్థానిక సమస్యల పరిష్కారం కృషి చేస్తారనే గుర్తింపు జీవన్ రెడ్డికి ఉంది. నేనే పద్యములు నిజాంబాద్ పార్లమెంట్ పరిధిలో మెజార్టీ గల్ఫ్ కార్మికులు జీవన్ రెడ్డి పైపు మొగ్గు చూపినట్టు చర్చ మొదలైంది.

వివరాల్లోకి వెళ్తే..


నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో మొత్తం 16,89,975 ఓటర్లు ఉన్నారు. 1,48,136 మంది పురుషులు గల్ఫ్ దేశాలకు వలస వెళ్లినట్లు ఒక అంచనా. గల్ఫ్ దేశాలలో ఉన్న ఒక కార్మికుడు (ఆబ్సెంటీ ఓటర్) తన ఇద్దరు కుటుంబ సభ్యులను ప్రభావితం చేస్తాడు అనుకుంటే… 2,96,272 మంది అవుతారు.


గత పదేళ్ళలో 78,983 మంది గల్ఫ్ దేశాల నుంచి వాపస్ వచ్చి గ్రామాలలో స్థిరపడినట్లు ఒక అంచనా. ఈ లెక్కన నిజామాబాద్ లోక్ సభ పరిధిలో 3,75,255 (22.21%) గల్ఫ్ ఓటు బ్యాంకు ఉన్నట్లు తెలుస్తోంది.
గల్ఫ్ దేశాలలో ఉన్న వలస కార్మికులు ఈ ఎన్నికల్లో ఓటు వేయడం కోసం స్వయంగా రావడం వీలుకాదు. గత పదేళ్లలో కేంద్రంలోని బీజేపీ మోదీ ప్రభుత్వం…

ఎన్నారైలకు ఎలక్ట్రానికల్లీ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ సిస్టం (ET PBS) –  ఆన్ లైన్ ఓటింగ్ ఓటింగ్ సౌకర్యం కల్పించలేకపోయింది. వారు ‘ఆబ్సెంటీ ఓటర్స్’ గా మిగిలిపోతున్నారు. కానీ వారి కుటుంబ సభ్యుల ద్వారా ‘రిమోట్ ఇంఫ్లూయెన్స్’ తో ఈ ఎన్నికల్లో ప్రభావం చూపనున్నారు.


జాతీయవాదం, దేశభక్తి, మాతృభూమి నినాదాలతో ప్రవాసులు బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నట్టు నెల రోజుల క్రితం ఒక అంచనా ఉండే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల హైదరాబాద్ లో గల్ఫ్ భరోసా ఆత్మీయ సమావేశంలో గల్ఫ్ బోర్డు, ఎన్నారై పాలసీ పై స్పష్టమైన హామీ ఇవ్వడం, అంతకు ముందు గల్ఫ్ మృతులకు ₹5 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా చెల్లింపును ప్రారంభించడంతో గల్ఫ్ ఓటు బ్యాంకు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నట్టు సమాచారం.


గల్ఫ్ ఓటు బ్యాంకు కాంగ్రెస్ కు 44 శాతం, బీజేపీకి 39 శాతం, బీఆర్ఎస్ కు 12 శాతం, ఇతరులకు 5 శాతం ఉన్నట్లు ఒక శాంపిల్ సర్వే తెలుపుతున్నది. వాస్తవాలు కాస్త అటూ, ఇటుగా ఉండవచ్చు. పోలింగ్ కు మరో మూడు రోజులు సమయం ఉంది. గల్ఫ్ ప్రవాసులను ఆకట్టుకోవడానికి ఆయా పార్టీల అనుబంధ విభాగాలు ప్రచారాన్ని ముమ్మరం చేసినా కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి వైపే గల్ఫ్ కార్మికులు, వారి కుటుంబ సభ్యులు మొగ్గు చూపినట్టు చర్చ మొదలైంది.