గెలుపు ఓటములు సహజం ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ !

J.SURENDER KUMAR,

క్రీడల పోటీలలో, జీవన గమనంలో గెలుపు ఓటములు సహజమే, ఓటమితో కృంగిపోవద్దని, ఓటమి గెలుపుకు బాటలు చూపిస్తుందని ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

ధర్మపురి మండలం నక్కలపేట లో శుక్రవారం వాలీబాల్ ఫైనల్స్ మ్యాచ్ జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని విన్నర్, రన్నర్ జట్లకు బహుమతి ప్రధానం తో పాటు, నగదును ప్రోత్సాహకంగా అందించారు. పవర్ స్టార్ యూత్ జట్టుకు ₹ 5 వేల రూపాయల నగదు బహుమతితో పాటు ట్రోఫీని అందజేశారు, రన్నర్ గా నిలిచిన ఫ్రెండ్స్ యూత్ (పోచమ్మ వాడ) జట్టుకు ₹ 3 వేల రూపాయల నగదు బహుమతితో పాటు ట్రోఫీని అందజేశారు.

క్రీడల క్రీడాకారుల అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్ని రకాల చర్యల చేపడుతున్నట్టు ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ క్రీడాకారులకు వివరించారు.

ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.


👉 రథోత్సవంలో…

ధర్మారం మండలం ఖిల వనపర్తి శుక్రవారం జరిగిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి రధోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే అడ్లూరీ లక్ష్మణ్ కుమార్ పెద్దపెల్లి ఎంపి అభ్యర్థి గడ్డం వంశి పాల్గొన్నారు.


ఈ సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి, కరుణ కటాక్షాలు ధర్మపురి నియోజక వర్గ ప్రజలపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నట్లు, ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం నుండి అన్ని రకాల సహా సహకారాలు అందిస్తామని స్పష్టం చేశారు.