కాక రుణం తీర్చుకుంటున్న ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ దంపతులు !


J.SURENDER KUMAR,


ఈ నెల 13న జరుగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపల్లి

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ ను భారీ ఓట్ల

మెజార్టీతో గెలిపించి స్వర్గీయ కాక ( వెంకటస్వామి ) రుణం

తీర్చుకోవడానికి ధర్మపురి ఎమ్మెల్యే అడ్డూరి లక్ష్మణ్ కుమార్

దంపతులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.


👉వివరాల్లోకి వెళితే.

రాజకీయ దిగ్గజం కేంద్ర మాజీ మంత్రి, స్వర్గీయ వెంకటస్వామి మనుమడు, వంశీకృష్ణ పెద్దపల్లి నుంచి ఎంపీగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.

👉రుణం తీర్చుకోవడానికి…

ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్, మొదట రాజకీయ అరంగ్రేటం 2006లో స్వర్గీయ వెంకటస్వామి ( కాక ) ఆశీస్సులతో జరిగిందని పదే పదే ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ వివరిస్తుంటారు . ధర్మారం మండల కాంగ్రెస్ జెడ్పిటిసి సభ్యుడిగా  తాను పోటీ చేయడానికి  బి ఫామ్ ఇవ్వడంతో పాటు. ప్రత్యర్థి మాజీ మంత్రి ( మాతంగి నరసయ్య, తెలుగుదేశం) పై  దాదాపు మూడు వేల ఓట్ల మెజార్టీతో గెలుపుకు కాక రాజకీయ వ్యూహం పన్నినట్టు  ఎమ్మెల్యే సందర్భాల్లో వివరిస్తూ ఉంటారు.

తదనంతర రాజకీయ పరిణామాల నేపద్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా జెడ్పి చైర్మన్ గా ఉమ్మడి రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గా, రాజకీయ పదవులు చేపట్టిన లక్ష్మణ్ కుమార్, 2009, 2014, 2018, లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తు , 2023లో భారీ ఓట్ల మెజార్టీతో సిట్టింగ్ మంత్రి కొప్పుల ఈశ్వర్ ను ఓడించారు.

👉ఎమ్మెల్యే శ్రీమతి కాంతా కుమారి….

పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ కు మద్దతుగా ప్రచార కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే శ్రీమతి కాంతా కుమారి. ఎండపెల్లి , ధర్మారం, వెలుగట్టుర్ మండలలోని  గ్రామాల్లో గడప గడపకు ఆమె ప్రచారం చేస్తున్నారు.

కాంగ్రెస్ పార్టీ ప్రవేశ పెట్టిన ఆరు గ్యారెంటీల ను ప్రజలకు వివరిస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా సంక్షేమం కోసం ఎనలేని కృషి చేస్తున్నది అని  ఉచిత బస్సు ప్రయాణం, ₹ 500 కు సిలిండర్, విద్యుత్తు సబ్సిడీ, గృహజ్యోతి, ఆరోగ్యశ్రీ పరిధి ₹10 లక్షల కు పెంచడం, తదితర సంక్షేమ పథకాలను ఆమె ఓటర్లకు వివరిస్తున్నారు.

👉పక్క ప్రణాళిక తో


మంత్రి శ్రీధర్ బాబు తో, ముఖ్య కార్యకర్తల సమావేశలు, సీఎం రేవంత్ రెడ్డి తో తన నియోజకవర్గ రాజారాం పల్లిలో జనజాతర సభ, మంత్రి శ్రీధర్ బాబు తో కార్నర్ మీటింగ్ లు నిర్వహిస్తున్న ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్, కాంగ్రెస్ నాయకులకు కార్యకర్తలకు టార్గెట్ ఫిక్స్ చేసినట్లు సమాచారం !

👉మున్సిపాలిటీ, మండల కేంద్రాలో..

1
తన గెలుపు కోసం  ఎన్నికల్లో నాయకులు, కార్యకర్తలు తమ తమ గ్రామాలలో, వార్డులలో  తనకు వేయించిన ఓట్ల కంటే కనీసం 10 శాతం అధికంగా ఉండాలని ముఖ్య నాయకులకు, కార్యకర్తలకు వివరించి టాస్క్ ఇచ్చినట్టు తెలిసింది.


👉త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో.

త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో జెడ్పిటిసి, ఎంపీటీసీ, మున్సిపల్ కౌన్సిలర్  కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశిస్తున్న వారు, నామినేటెడ్ పదవులు ఆశిస్తున్న నాయకులు, గ్రామాల్లో సర్పంచ్, వార్డు సభ్యుల పోటీకి రంగం సిద్ధం చేసుకుంటున్నా చోటా, మోటా నాయకులు ఎమ్మెల్యే మద్దతు, కోసం వారు తమ తమ వార్డులలో, గ్రామాల్లో, కాంగ్రెస్ పార్టీ కి మెజార్టీ ఓట్లు  వేయించాలని కాంగ్రెస్  నాయకత్వం టాస్క్ పెట్టినట్టు సమాచారం.

ఎన్నికల ప్రచారంతో పాటు, అనేక సందర్భాలలోనూ ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్, తనకు, తన కుటుంబానికి కాక వెంకట స్వామి కుటుంబం తో దశాబ్దాలుగా ఉన్న బంధం, అనుబంధం గూర్చి అనేక బహిరంగ సభలోను వివరించడం తోపాటు, ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీ నా సోదర సమానుడని, వివరిస్తున్న విషయం తెలిసిందే.

తాను సాధించిన ఓట్ల మెజార్టీ కంటే అధికంగా , గడ్డం వంశీకి వచ్చేలా ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ దంపతులు, పక్కా ప్రణాళికతో బూత్ వారీగా పోలింగ్ కు శ్రీకారం చుట్టినట్టు సమాచారం.