కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి పెద్ద జయంతి ఉత్సవాలకు భారీ ఏర్పాట్లు !

👉 దాదాపు లక్షన్నర మంది భక్తులు రాక !

👉 2 వేల మంది నాయిని బ్రాహ్మణులు తల నీలాల కోసం నియామకం !

👉 3 వందల మంది మాలా విసర్జన కై అర్చకుల నియామకం

👉 112 సీసీ కెమెరాల పర్యవేక్షణలో!

👉 4 లక్షల లడ్డూలు సిద్ధం !

👉 9 వందల మంది పోలీ బలగాలు !

👉 కొండగట్టు పై ఉచిత బస్సు సౌకర్యం !

J. SURENDER KUMAR,


ఈ నెల 30 నుండి జూన్ 1 వరకు అత్యంత వైభముగా జరగనున్న కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి పెద్ద జయంతి ఉత్సవాలకు మూడు రోజులపాటు భారీగా తరలి రానున్న దాదాపు లక్షన్నరమంది అంజన్న భక్తుల సౌకర్యార్థం దేవాదాయ శాఖ, ఆలయ అధికార యంత్రాంగం, జగిత్యాల జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దివాకర్ పర్యవేక్షణలో గత వారం రోజులుగా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.

👉 రెండు వేల మంది నాయిని బ్రాహ్మణులు !

దాదాపు లక్షన్నర మంది అంజన్న దీక్షా స్వాములకు కొండగట్టుకు తరలి రామన్నట్టు అంచనా వేసిన యంత్రాంగం స్వాముల తల నీలాలు తీయుట కు తాత్కాలిక ప్రాతిపదికన 2000 మంది నాయిని బ్రాహ్మణులను నియమించారు. 3 చోట్లలో ప్రత్యేక తలనీలాల కేంద్రాలు ఏర్పాటు చేశారు.

👉మూడు వందల మంది అర్చకులు…

ఆంజనేయ స్వామి దీక్ష లో ఉన్న స్వాములకు మాల విసర్జనకు, సేవలు అందించడానికి తాత్కాలికంగా 300 మంది అర్చకులను నాలుగు రోజులపాటు నియమించారు. దీక్షా మండపములో అసౌకర్యము కలగకుండా 5. ప్రత్యేక క్యూ గ్యాలరీ లు ఏర్పాటు చేశారు.

👉 చలువ పందిళ్ళు…

దేవాలయ ప్రాంగణములో, రహదారుల వెంట వెదురు తడకలతో పందిళ్ళు వేస్తున్నారు. వేసవి నేపథ్యంలో స్వాముల కాళ్ళు కాలకుండా దేవాలయ ప్రాంగణములో ‘ కాయిర్ మ్యాట్స్తో’ ప్రత్యేకముగా ఏర్పాటు చేశారు.
క్యూ లైన్ లలో భక్తులకు త్రాగు నీరు అందించుటకు సేవాసమితి వారిని నియమించారు.

👉 షవర్ ల ఏర్పాట్లు..

భక్తుల సౌకర్యార్ధము కోనేరు వద్ద షవర్స్ లు ఏర్పాటు చేశారు. కోనేటిలో నీటిని ప్రతి రోజు తొలగిస్తూ , శుద్ధ జలం కోనేటిలోకి విడువనున్నారు. పార్కింగ్ స్థలం వద్ద షవర్స్ లు ఏర్పాటు చేశారు.

👉 28 చోట్ల చలివేంద్రాలు..

ఆలయ ప్రాంగణము, బొజ్జ పోతన్న, JNTU, కొండ కింది వరకు, 28 చోట్ల భక్తుల సౌకర్యార్ధము చలివేంద్రములు ఏర్పాటు చేశారు.
ట్యాంకర్ ల ద్వారా చలివేంద్రములలో నీటి సరఫరా కోసం 5 ఆటో ట్రాలీలలో సింటెక్స్ వాటర్ ట్యాంక్ సరఫరా చేయుటకు ఏర్పాట్లు చేపట్టారు.

👉 ఏడు ప్రాంతాల్లో పార్కింగ్..

7 పార్కింగ్ ప్రాంతాలను ఏర్పాట్లు చేసి అక్కడ త్రాగునీరు, టెంట్, జనరేటర్ ద్వారా విద్యుత్ సౌకర్యం, లైటింగ్ ఏర్పాటు చేయనున్నారు.

👉 మొబైల్ టాయిలెట్స్..

దీక్షా స్వాములకు, భక్తుల సౌలభ్యం కోసం ప్రస్తుతము ఉన్న టాయిలేట్స్ తోపాటు, మొబైల్ టాయిలెట్స్, తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాట్లు చేయనున్నారు.

👉 ఉచిత బస్సుల సౌకర్యం ..

పార్కింగ్ స్థలము నుండి ఆలయం వరకు భక్తులు సౌకర్యార్థం ఉచితంగా నాలుగు ఆర్టీసీ బస్సుల ను ఏర్పాటు చేశారు.

👉 నాలుగు లక్షల లడ్డు ప్రసాదాలు సిద్ధం..

భక్తులకు లడ్డు ప్రసాదాల అమ్మ కాల కోసం దాదాపు నాలుగు లక్షల లడ్డు ప్రసాదాలు సిద్ధం చేయుటకు ఏర్పాట్లు చేపట్టారు. నిత్యం పులిహోర ప్రసాదాలు తయారు చేయుటకు ఆలయ అధికారులు నిర్ణయించారు.

👉 ఏడు ప్రసాదాల కౌంటర్లు,

భక్తులకు ప్రసాదాలను విక్రయించడానికి వీలుగా భక్తుల సౌలభ్యం కోసం ప్రసాదము టిక్కెట్టుల కోసం , ఏడు కౌంటర్లను ఏర్పాటు చేశారు. అంజన్న స్వాముల దీక్షా విరమణ, శీఘ్రదర్శనం, తలనీలాల టిక్కెట్లు అమ్మకాల కోసం 6 అదనపు కౌంటర్లను ఆలయ అధికారులు ఏర్పాటు చేశారు.

👉 నూట పన్నెండు సీసీ కెమెరాలు..

భక్తజనం భద్రత చర్యలో భాగంగా ఆలయ ప్రాంగణం కొండ ప్రాంతాలలో మొత్తం 112 సీసీ కెమెరాల ద్వారా యంత్రాంగం పర్యవేక్షణ చేపట్టనున్నది. ప్రస్తుతం ఉన్న 64 సిసి కెమరాల అదనంగా మరో 48 సిసి కెమెరాలను ఏర్పాటు చేశారు.

👉 తొమ్మిది వందల మందితో పోలీసులతో బందోబస్తు..

భద్రతా చర్యలలో భాగంగా పోలీస్ శాఖ నుండి దాదాపు 900 మంది వరకు వివిధ హోదాలలో గల పోలీస్ అధికారులు, సిబ్బంది భద్రత చర్యలు చేపట్టనున్నారు.

👉 అరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఏర్పాటు!

తీవ్ర ఎండ వేసవి నేపథ్యంలో భక్తుల సౌకర్యార్థం ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఆరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రములు ఏర్పాటు ఏర్పాటు చేశారు. అగ్నిమాపక శాఖ ద్వారా స్టాండ్ బై వెహికిల్ ఏర్పాటు చేశారు.

👉 24 గంటలపాటు పారిశుధ్య పనులు..

కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా పంచాయితీ రాజ్ అధికారి పర్యవేక్షణలో పారిశుద్ధ్య సామాగ్రి, సిబ్బందిని, నియమించి, 24 గంటల పాటు నిరంతరం షిఫ్ట్ పద్ధతిలో డ్రెస్ కోడ్ తో పారిశుద్ధ్య పనులు నిర్వహించనున్నారు.

👉 ఉచిత అన్నదానం..

కొండగట్టు క్షేత్రంలో మూడు రోజులపాటు స్వాములకు, భక్తజనంకు ఉచిత శ్రీ లలిత సేవా ట్రస్ట్, కరీంగనర్ వారి ఆధ్వర్యంలో మూడు రోజులపాటు నిర్వహించుటకు ఏర్పాట్లు చేస్తున్నారు.

కలెక్టర్ కార్యాలయంలో సోమవారం జరిగిన ఉత్సవ ఏర్పాట్లు సమావేశంలో ఆర్డీఓ మధుసూదన్, జెడ్పీ సి. ఇ. ఓ. రఘువరన్, డి. ఎస్పీ., రఘు చందన్, కొండగట్టు ఆలయ ఈ. ఓ. చంద్ర శేఖర్, జిల్లా పంచాయతీ అధికారి దేవరాజ్, కలెక్టరేట్ ఏ. ఓ. హన్మంత రావు, వివిధ శాఖల అధికారులు, మున్సిపల కమిషనర్లు, ఎంపీడీఓలు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.