👉మాదిగ సామాజిక వర్గానికి న్యాయం జరిగేనా ?
J.SURENDER KUMAR,
పార్లమెంట్ ఎన్నికల కోడ్ ఎత్తివేత అనంతరం జరగనున్న
మంత్రివర్గ విస్తరణలో ధర్మపురి ఎమ్మెల్యే అడ్డూరి లక్ష్మణ్
కుమార్ కు స్థానం దక్కనున్నట్టు కాంగ్రెస్ వర్గాలలో చర్చ
మొదలైంది. 17 పార్లమెంట్ స్థానాలలో మాదిగ సామాజిక
వర్గానికి ఒక్క స్థానం కేటాయించకపోవడంతో, ఆ వర్గానికి
అన్యాయం జరిగిందనే విమర్శ ఉంది.
మంత్రివర్గ విస్తరణలో సీఎం రేవంత్ రెడ్డి, ఆ వర్గానికి న్యాయం చేస్తారనే నమ్మకం ఆ సామాజిక వర్గంలో ఉందనే చర్చ. చివరి నిమిషంలో కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా ఒకే ఒక్క వెలమ సామాజిక అభ్యర్థిని ఎంపిక చేసి న్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీ, మంత్రివర్గ విస్తరణలో మాదిగ సామాజిక వర్గానికి న్యాయం చేస్తారు అనే విశ్వాసం వారు వ్యక్తం చేస్తున్నారు.
👉సీనియార్టీ.. సిన్సియారిటీ !
ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్, ఎన్నికల్లో ఓడిన, గెలిచిన కాంగ్రెస్ పార్టీని వీడని సీనియర్, సిన్సియర్ నాయకుడిగా, పార్టీ అధిష్టానం లో ప్రత్యేక గుర్తింపు ఉంది. 2006 స్థానిక సంస్థల ఎన్నికల్లో ధర్మారం జడ్పిటిసి సభ్యుడిగా పోటీచేసి ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ మంత్రి మాతంగి నరసయ్య పై, మూడు వేల ఓట్ల మెజార్టీతో విజయ సాధించారు. రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిషత్ చైర్మన్ గా లక్ష్మణ్ కుమార్ దాదాపు రెండు సంవత్సరాలు కొనసాగారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ 2014 కొరకు కొనసాగారు. అసెంబ్లీ పునర్ విభజికరణ లో ఏర్పడిన నూతన ధర్మపురి రిజర్వ్డ్ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి లక్ష్మణ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి, టిఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ చేతి లో స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చెందారు. కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాల మేరకు, ఇదే నియోజకవర్గంలో నుంచి మధ్యంతర ఎన్నికల్లో ను టిఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ పై పోటీ చేసి లక్ష్మణ్ కుమార్ ఓటమి చెందారు. 2014 స్వరాష్ట్రలో జరిగిన ఎన్నికల్లోను కాంగ్రెస్ అభ్యర్థిగా తిరిగి ధర్మపురి నియోజకవర్గం టిఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ పై పోటీచేసి ఓడిపోయారు.
( టిఆర్ఎస్ అధిష్టానం, మాజీ మంత్రి కేటీఆర్ తమ పార్టీ అభ్యర్థిగా 2014 లో పెద్దపల్లి పార్లమెంట్ టికెట్టు ఆఫర్ చేసిన లక్ష్మణ్ కుమార్ సున్నితంగా తిరస్కరించిన విషయం రాజకీయ వర్గాలకు తెలిసిన విషయమే )
2018 అసెంబ్లీ ఎన్నికల్లో ధర్మపురి అసెంబ్లీ నుంచి టిఆర్ఎస్ అభ్యర్థి నాటి చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ పై పోటీ చేసి కేవలం నాలుగు వందల ఓట్లతో లక్ష్మణ్ కుమార్ ఓటమి చెందారు. ( ఓట్ల లెక్కింపులో అధికారులు అవకతవకలకు పాల్పడి తనను ఓడించారని లక్ష్మణ్ కుమార్, హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే)
👉సిట్టింగ్ మంత్రి కొప్పుల ను ఓడించి…
2023 డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి, క్యాబినెట్ సిట్టింగ్ మంత్రి కొప్పుల ఈశ్వర్ ను భారీ ఓట్ల మెజార్టీతో ఓడించి లక్ష్మణ్ కుమార్ తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టారు. జగిత్యాల జిల్లా లో జగిత్యాల, కోరుట్ల అసెంబ్లీ స్థానాలు బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించగా, జిల్లాలో ఏకైక కాంగ్రెస్ ఎమ్మెల్యే గా లక్ష్మణ్ కుమార్ గెలిచారు.
👉ఓడిన గెలిచిన. ప్రజాక్షేత్రంలో నే…
2009 నుంచి 2023 వరకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా టిఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ పై పోటీ చేస్తూ ఓటమి చవిచూస్తున్న, లక్ష్మణ్ కుమార్, కాంగ్రెస్ పార్టీనీ వీడలేదు, నిరంతరం ప్రజా సమస్యలపై, ప్రజాక్షేత్రంలో ఉంటూ సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు, ధర్నాలు, రాస్తారోకోలు చేశారు. లక్ష్మణ్ కుమార్ పై బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక కేసులు నమోదు చేసింది. ఆర్థికంగా, శారీరకంగా ఇబ్బందులకు గురిచేసింది. బీఆర్ఎస్ మంత్రుల పర్యటన ల సందర్భంగా లక్ష్మణ్ కుమార్ తో పాటు క్యాడర్ ను గృహ నిర్బంధాలు, ముందస్తుగా అదుపులో తీసుకొని సుదూర అటవీ ప్రాంత పోలీస్ స్టేషన్ ల కు తరలింపు తదితరు ఇబ్బందులకు గురి చేసినా లక్ష్మణ్ కుమార్, నియోజకవర్గాన్ని వీడలేదు, ఆందోళనలు ఆపలేదు. టిఆర్ఎస్ ప్రభుత్వం లో జరిగిన ధర్మపురి మున్సిపల్ ఎన్నికల్లో 15 స్థానాల్లో 7 ఏడు స్థానాలు కైవసం చేసుకోవడంతో పాటు, మరో రెండు స్థానాలు స్వల్ప ఓట్లతో కాంగ్రెస్ పార్టీ కోల్పోయింది.
👉మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిల అండదండలతోనే…

తాను ఎన్నికల్లో ఓడిన ప్రతిసారి, మంత్రి శ్రీధర్ బాబు, తన సోదరుడిగా, ఓదార్చడం, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఓడిన గెలిచిన ప్రజాక్షేత్రంలో ఉండాలి అంటూ ధైర్యం చెప్పడంతో పాటు, నాకు అండగా నిలిచి, పార్టీపరంగా, ఆర్థికంగా ఆదుకున్నారని, తన గెలుపుకు వారు మార్గదర్శకులు అని ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ అనేక సభలలో బహిరంగంగా ఈ ఉదంతాలు ప్రస్తావిస్తూ వారి రుణం జన్మజన్మలకు తీర్చుకోలేను అంటు కంటతడి పెట్టేవారు.
👉సీఎం ను కలసిన సాగునీటి అంశమే..
ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్, సీఎం రేవంత్ రెడ్డిని మంత్రి శ్రీధర్ బాబు ను పలుమార్లు కలిసిన, ఎండుతున్న పంటలకు సాగునీరు అందించాలని, పత్తిపాక రిజర్వాయర్ చేపట్టాలని, నియోజకవర్గంలో అభివృద్ధి పనుల కోసం దాదాపు ₹ 40 కోట్ల నిధులు మంజూరు చేయించుకున్నారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో మరో ₹ 50 కోట్లు మంజూరు అయినా నిధులు విడుదల కాలేదు.
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ గెలుపు కోసం ఎండపల్లి మండలం రాజారాం పల్లెలో ఈ నెల 3న జరిగిన జన జాతర సభ కు సీఎం రేవంత్ రెడ్డి, చాలా ఆలస్యంగా వచ్చారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి తన ప్రసంగంలో ‘లక్ష్మణ్ కుమార్ హుకుం జారీ చేస్తే ఆలస్యమైన రాక తప్పదని’ పేర్కొనడం కాంగ్రెస్ వర్గాలలో హాట్ హాట్ చర్చ అయ్యింది.
👉మంత్రివర్గ విస్తరణలో ఆరుగురికి చోటు..
సీఎంతో కలుపుకొని 18 మంది మంత్రివర్గంలో ఉండాల్సి ఉండగా, ప్రస్తుతం సీఎంతో కలిసి 12 మంది మంత్రులు ఉన్నారు. మరో ఆరుగురికి మంత్రివర్గంలో అవకాశం ఉంటుంది.
మంత్రివర్గ విస్తరణలో మంచిర్యాల ఎమ్మెల్యే, ప్రేమ్ సాగర్ రావు, బోధన్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డిలతో పాటు , ఎస్సీ , ఎస్టి, బిసి లకు క్యాబినెట్ లో అవకాశం ఉన్నట్టు సమాచారం. మిగిలిన ఒక్క స్థానం మైనారిటీకి కేటాయిస్తారా ? లేదా ప్రొఫెసర్ కోదండరామ్ ను మంత్రివర్గంలో చేర్చుకుంటారా ? అని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.