నా గెలుపు కోసం కష్టపడిన వారిని కడుపులో పెట్టి కాపాడుకుంటా !

👉ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్!

👉కాంగ్రెస్ భారీ బైక్ ర్యాలీ లో పాల్గొన్న ఎమ్మెల్యే వివేక్, ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణ !

J.SURENDER KUMAR

బిఆర్ ఎస్ ప్రభుత్వ నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా, ధైర్యంగా నిలిచి నాకోసం, నా గెలుపు కోసం కష్టపడిన నాయకులను, కార్యకర్తలను, కష్టపడ్డ వారందరినీ  కడుపులో పెట్టుకొని కాపాడుకుంటానని, నా సోదర సమానుడు ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణ భారీ ఓట్ల మెజార్టీతో గెలిపించాలని ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్  లక్ష్మణ్ కుమార్ అన్నారు.
పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణకు మద్దతుగా ఎమ్మెల్యేలు లక్ష్మణ్ కుమార్,  వివేక్ ఆధ్వర్యంలో గురువారం ధర్మపురి నియోజకవర్గం రాయపట్నం నుంచి ధర్మపురి పట్టణం వరకు (ద్విచక్ర వాహన) బారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.  భారీ సంఖ్యలో యువకులు , కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు.  ఈ సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ కుమార్ మాట్లాడారు.

ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ. కె సి ఆర్, నరేంద్రమోదీ ఇద్దరు మోసగాల్లె అని వివేక్ విమర్శించారు. బిజెపి కి దమ్ముంటే కాళేశ్వరం పై విచారణ జరిపించాలని మోడీ అమిత్ షా లకు సవాల్ విసిరారు. బిజెపి కి వ్యతిరేకంగా మాట్లాడితే నా పై ఈ డీ దాడులకు ఉసికొల్పు తున్నారని, న్యాయంగా వ్యాపారం చేసుకుంటున్న ఎవ్వరూ  నన్ను ఏమి చేయలేరని మండిపడ్డారు. మోడీ ప్రభుత్వం ఆధాని, అంబానీ ల కోసమే  పని చేస్తుందన్నారు.


దళిత మంత్రి అని చెప్పుకునే కొప్పుల ఈశ్వర్ దళితులకు మాత్రం అన్యాయం చేశారనీ అన్నారు.  ఇప్పుడు కార్మిక నాయకుడి అని చెప్పుంటున్న కొప్పుల ఈశ్వర్ మంత్రి గా ఉండి కార్మికుల సంక్షేమం గురించి  ఏం చేశారని ఆరోపించారు. కేసీఆర్ కాళేశ్వరం లో లక్ష కోట్ల అవినీతికి పాల్పడితే ఈ.డి విచారణ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు.
మోడీ ప్రతిపక్షాలను ఈడీ, ఐటి దాడులతో అణిచివేయాలని చూడటం గమనించాలన్నారు.


వంశీని మీ ఇంటి బిడ్డగా భావించి  గెలిపించాలని వివేక్ విజ్ఞప్తి చేశారు. తెలంగాణ వస్తే మన బతుకులు బాగుపడతాయని అనుకుంటే  కే సి ఆర్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసీ ఆగం చేశారని వంశీ మండిపడ్డారు. తలాపున గోదావరి ఉన్న తాగు సాగు నీరు కు ఇక్కట్లు తప్పడం లేదన్నారు. బి ఆర్ ఎస్ పాలన లో తెలంగాణ నిరుద్యోగుల తెలంగాణ గా మారిందని ఎద్దేవా చేశారు.

ఇసుక దందాలు, భూకబ్జాల తోనే టిఆర్ఎస్ ప్రభుత్వ పాలన గడిచిపోయిం దని విమర్శించారు. మా తాత కాక వెంకటస్వామి స్ఫూర్తి తో రాజకీయాల్లోకి సేవ చేయడానికి వస్తున్న నన్ను గెలిపించి పార్లమెంటుకు పంపిస్తే పెద్దపల్లిలో ప్రభుత్వ రంగ సంస్థలను తీసుకువస్తానని హామీ ఇచ్చారు.