J.SURENDER KUMAR,
భారతదేశ నుండి పుణ్యక్షేత్రాల దర్శనం కోసం ఈ నెల మూడున బయలుదేరిన యాత్రికుల బృందం
హిందువులు పరమ పవిత్ర పర్వదినం అక్షయ తృతీయ పూజాది కార్యక్రమాలు సుహాసిని మహిళలు శుక్రవారం నేపాల్ దేశంలో సనాతన సాంప్రదాయ ఆచార పద్ధతులు వేద మంత్రాలతో జరుపుకున్నారు.
వివరాల్లోకి వెళితే..
పుణ్యక్షేత్రాల దర్శనం కోసం ఈ నెల మూడున భారతదేశం నుండి తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లా లింగన్నపేట గ్రామానికి చెందిన వసొజ్జుల రామశర్మ ఆధ్వర్యంలో బయలుదేరిన యాత్రికుల బృందం అక్షయ తృతీయ శుక్రవారం నేపాల్ దేశం ప్రొక పట్టణానికి చేరుకుంది. ఈ నేపథ్యంలో పట్టణంలోని స్వచ్ఛమైన ప్రాంతంలో సిద్దిపేటకు చెందిన జనుమంచి సీతారామ శర్మ పర్యవేక్షణలో సుహాసిని మహిళలకు అక్షయ తృతీయ పర్వదినం సందర్భంగా పూజారి కార్యక్రమాలు నిర్వహించారు. ఈకార్యక్రమంలో చుంచన కోట కు చెందిన లలితా మూర్తి శర్మ దంపతులు, లింగన్నపేట సూర్యనారాయణ శర్మ దంపతులు పాల్గొన్నారు

👉అక్షయ తృతీయ
వేద పండితులు వివరిస్తున్న అక్షయ తృతీయ విశిష్టతలు అనేకం ఉన్నాయి. అక్షయ తృతీయ రోజున మహా విష్ణువు, ఆరవ అవతారమైన పరశురాముని జననం. ఈ పవిత్ర రోజున త్రేతాయుగం ప్రారంభమైనదని పండితుల కథనం. గంగాదేవి భువిపై ఉద్భవించిన రోజు నేడు. అక్షయ తృతీయ రోజున వ్యాస మహర్షి “మహా భారతం” పవిత్ర గ్రంథాన్ని రచన పారంభించిన రోజు. ఈ రోజున అమ్మ “అన్నపూర్ణ దేవి” అవతరించిన రోజు. అక్షయ తృతీయ పవిత్ర రోజును కుబేరుడు శివుడి అనుగ్రహం పొంది మహలక్ష్మి ద్వారా అనంత సంపదను పొంది సంరక్షకుడిగా నియమింప బడ్డాడు. శ్రీకృష్ణుడు ద్రౌపదిని దుశ్చాసన దుశ్చర్య నుండి కాపాడిన రోజు. శ్రీకృష్ణుడు తన బాల్య మిత్రుడైన కుచేలుడు ఇచ్చిన అటుకులను ఆరగించి అపార సంపదను అనుగ్రహించిన రోజు. సూర్య భగవానుడు అజ్ఞాత వాసంలో పాండవులకు “అక్షయపాత్ర” ను ఇచ్చిన రోజు. ఆదిశంకరాచార్యుల వారు ఓ పేద వృద్ధ జంట లబ్ది కోసం సృష్టిలో తొలిసారి “కనకధారాస్ధవం” స్తుతించిన రోజు. ఈ పవిత్ర దినానే, దివ్య క్షేత్రం “బద్రీనాథ్” ఆలయ ద్వారాలు 4 నెలల దర్శన విరామం తర్వాత, పునః దర్శనార్థమై తెరుచుకో బడతాయి. ఏ ఏటికా ఏడు ఒడిషా పూరి రథయాత్ర సంబరాల కొరకు నిర్మించే రథ నిర్మాణం ప్రారంభించే రోజు. ఈరోజే సింహాచలం దివ్యక్షేత్రంలో సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనం, మరియు చందనోత్సవం ప్రారంభపు రోజు. బృందావనం లోని బంకే బిహరి ఆలయంలో, శ్రీకృష్ణుని పాదాలను దర్శించుకొనే అవకాశం ఒక్క అక్షయ తృతీయ రోజు అనేది ప్రాచీన పురాణం కథనాలు.