J.SURENDER KUMAR,
కొండగట్టు శ్రీ ఆంజనేయం స్వామి పెద్ద జయంతి ఉత్సవాల పర్యవేక్షణ కు దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతురావు ఇద్దరు ప్రత్యేక అధికారులను నియమించారు. దేవాదాయ శాఖ జాయింట్ కమిషనర్, ఎం రామకృష్ణారావు, డిప్యూటీ కమిషనర్ కమిషనర్ వినోద్ రెడ్డిలను నియమించగా వారు బుధవారం కొండగట్టు లో బాధ్యతలు చేపట్టారు.
ఆలయ ప్రధాన అర్చకులు, కార్య నిర్వహణ అధికారి చంద్రశేఖర్, తదితర అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఉత్సవ సమీక్ష సమావేశంలో కలెక్టర్, ఎస్పీలు తీసుకున్న నిర్ణయాలను తూచా తప్పక అమలు చేయాలని అధికారులకు, సిబ్బందికి, వారు వివరించారు.
పుష్కరిణి, లడ్డు, పులిహోర ప్రసాదాల తయారీ పనులను ప్రత్యేక అధికారులు పరిశీలించారు.

భక్తజనంకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా సేవలందించడానికి దేవాదాయ సిబ్బంది అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని. ప్రత్యేక అధికారులు ఉద్యోగులకు, సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.

ఇలా ఉండగా బుధవారం సాయంత్రం అంకురార్పణ పూజాది, కార్యక్రమాలతో అర్చక స్వాములు ఉత్సవాల ఆరంభానికి శ్రీకారం చుట్టారు. తాగునీటి సౌకర్యం, ఉచిత బస్సు సౌకర్యం, వైద్య సేవలు, ఉచిత అన్నదానం, మాల విసర్జన, తలనీలాల సమర్పణ క్యూలైన్లు, నిరంతర విద్యుత్ సౌలభ్యం, పోలీస్ బందోబస్తు, తదితర ఏర్పాట్లను ప్రత్యేక అధికారులు పరిశీలించారు.
