రైతాంగం పాలిట హమాలీలు ఆపద్బాంధవులు !

👉ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ !


J.SURENDER KUMAR,

ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అకాల వర్షానికి తడవకుండా సేవలందించిన హమాలీ లు రైతుల పాలిట ఆపద్బాంధవులని ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ అన్నారు.


మంగళవారం ధర్మపురి మండలం దోనుర్ గ్రామంలోని ఐకెపి సెంటర్ ను సందర్శించిన ఎమ్మెల్యే సకాలంలో వడ్ల కనుగోలును పూర్తి చేసిన సెంటర్ నిర్వాహకులను, హమాలిలను, ధాన్యం కొనుగోలు చేసిన రైస్ మిల్ యజమానిని శాలువాతో సన్మానించిన అభినందించారు.

ఈ సందర్భంగా రైతు సంక్షేమం కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేపడుతున్న అనేక పథకాలను ఎమ్మెల్యే వివరించారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


👉ఆహ్వానం..


ఎండపెల్లి మండలం గుల్లకోట గ్రామంలో నిర్వహించే రేణుక ఎల్లమ్మ తల్లి కళ్యాణం, మరియు పట్నాలకు ధర్మపురి శాసనసభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను మంగళవారం రోజున క్యాంప్ కార్యాలయం లో కలిసి గ్రామ ప్రజలు ఆహ్వానించారు .