J.SURENDER KUMAR ,
రాత్రి అయినా సరే జన జాతర సభ కు మీరు తప్పకుండా రావాలి అని ఆడ్లూరి లక్ష్మణ్ కుమార్ హుకుం జారీ చేశాడు అని సీఎం రేవంత్ రెడ్డి నవ్వుతూ తన ప్రసంగంలో అన్నారు.
పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ధర్మపురి నియోజకవర్గ రాజారాం పల్లిలో జరిగిన జన జాతర సభకు సీఎం రేవంత్ రెడ్డి పగలు మూడు గంటలకు పాల్గొని ప్రసంగించాల్సి ఉండే. శుక్రవారం రాహుల్ గాంధీ రాయబరే లిలో నామినేషన్ కార్యక్రమా నికి వెళ్లారు .
ఈ తరణంలో ధర్మపురి లో సీఎం సభ రద్దు అంటూ ప్రచార మాధ్యమా ల్లో స్క్రోలింగ్ వచ్చాయి. భారీగా జన సమీకరణ ప్రత్యేక ఏర్పాటు చేపట్టిన స్థానిక ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్, సీఎం రేవంత్ రెడ్డికి ఫోన్లో పరిస్థితిని వివరించి సభకు రావలసిందిగా
అభ్యర్థించారు. స్పందించిన సీఎం ఎంత రాత్రి అయినా సరే ధర్మపురి సభ కు వస్తాను అంటూ ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ కు హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే సీఎం తన ప్రసంగంలో హుకుం అంటూ నవ్వుతూ వివరించారు.
👉సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగంలో హెల్మెట్స్..

👉పత్తి పాక రిజర్వాయర్ పాలకుర్తి లిఫ్ట్
రామగుండంలో 800 మెగా వాట్లు పవర్ హౌజ్ ఏర్పాటు చేస్తా.
👉శ్రీదర్ బాబు పెద్దరికలో 2 లక్షల మెజార్టీ వస్తుందనిసీ ఎం ఆశాభావం వ్యక్తం చేశారు. దానికి శ్రీదర్ బాబు ఒకే అన్నారు
.
👉2 గంటలకు రావా ల్సి ఉండే రాహుల్ గాంధీ నామినేషన్ కారణంగా లేటయింది.
👉చీకటైనా రావాలని ఆడ్లూరి హుకుం జారీ చేశారు.
👉ఎర్రటి ఎండ మిట్ట మధ్యాహ్నం మొదలైన సభ కు పెద్దపల్లికి గొప్ప చరిత్ర ఉంది.
👉 మంథని నుంచి సర్పంచ్ గా ప్రదాన మంత్రిగా పీ వి ఆర్థికంగా సంస్కరణలతో ప్రపంచ దేశాల్లో బార త్ నిలదొక్కు కునేలా చేశారు .

👉సింగరేణి బొగ్గు గనులు నల్ల బంగారం తో గుర్తింపు పొందింది .సింగరేణి కి కాక వెంకట స్వామీ కేంద్రం నుంచి ₹1000 కోట్ల ఇప్పించారు.
👉 కాక కేంద్ర మంత్రిగా, శ్రీపాద రావు స్పీకర్ పదవికే వన్నె తెచ్చారు.
👉విలువలతో కూడిన రాజకీయం చేశారు. ప్రజల మధ్యనే శేష జీవిత గడిపారు
👉నా దృష్టికి వచ్చిన వాటన్నింటినీ పరిష్క రిస్తాను
👉మంచిర్యాలకు గోదావరి కరకట్టలు, సూపర్ స్పెశాలిటీ హాస్పటల్ ఏర్పాటు చేస్తా.
👉కలెక్టర్ కాలు పట్టు కొని గెలిచిన వ్యక్తి ఈశ్వర్
👉కొప్పుల కు ఓట్లు అడిగే నైతిక హక్కు లేదు, టిఆర్ఎస్ కు ఓటు అడిగే హక్కు లేదు

👉బొగ్గుగనుల ప్రయివేటీకరణ చేస్తే ఈశ్వర్ సైలెంట్ గా ఉన్నారు. చచ్చిన పాము బిఆర్ ఎస్ పడగ మీద కొట్టాలి .
👉.బిజెపి నోరు తెరిస్తే అబద్ధాలు మోడీ నోటి కొచ్చిన అబద్ధాలు చెప్తారు
👉పదేళ్లు అధికారంలో ఉన్నారు, రాష్ట్రానికి గాడిద గుడ్డు తప్ప ఏం తెచ్చారు
👉గుజరాత్ వాళ్లే మనుషులా ? తెలంగాణ పై సవతి తల్లీ ప్రేమ చూపెడుతున్నారు.
👉మూడో సారి మోడీ రావాలి 400 సీట్లు రావాలి రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లు రద్దు చేసే కుట్ర
👉400 సీట్లుమనువాద సిద్ధాంతాన్ని అవలంబిస్తున్నారు. ఓటు వేసి ముప్పు తెచ్చుకోవ ద్దు
👉 2021 నుంచి జనాభా లెక్కలను చేయటం లేదు
👉కిషన్ రెడ్డి, బండి,అమిథ్ షా 2021 జనాభా లెక్కలు చేయలేదు .కులగణన చేయలేదు
👉రిజర్వేషన్ రద్దు చేసే అధికారం ఎవరిచ్చారు.
👉 అధికారం కాంగ్రెస్ కు కొత్త కాదు రాజ్యాంగం ప్రమాదంలో పడుతుంది, రాహుల్ గాంధీ పీఎం గా గెలవాలి తెలంగాణ సమాజం ఆలోచించండి
👉 రిజర్వేషన్లు ఉండాలంటే కాంగ్రెస్ కు లేదంటే బిజెపికి ఓటు వేయండి బిజెపిఏమిచ్చింది గాడిద గుడ్డు తప్ప అన్నారు.