👉ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్!
J.SURENDER KUMAR ,
దేశానికి సాంకేతికతను తీసుకువచ్చి సాంకేతిక విప్లవానికి నాంది పలికింది రాజీవ్ గాంధీ అని, అభివృద్ధి చెందుతున్న దేశాల సరసన భారత దేశాన్ని నిలిపిన ఘనత ఆయనకే చెందుతుందని, బాబు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ అన్నారు.
మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా మంగళవారం ధర్మపురి పట్టణంలోని స్థానిక నంది విగ్రహం వద్ద నిర్వహించిన వర్ధంతి కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ గారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు
అనంతరం మీడియాతో మాట్లాడుతూ.
40 ఏళ్ళ వయసులో భారత యువ ప్రధానిగా బాధ్యతలు చేపట్టి న వ్యక్తి రాజీవ్ గాంధీ గారని,
దేశంలో బీదరికాన్ని పారద్రోలి సమ సమాజ స్థాపనకు ఆయన చేసిన కృషి ఎప్పటికి మరవలేమని, బడుగు బలహీన వర్గాల కోసం, అట్టడుగు వర్గాల కోసం ఆయన ఎంతో కృషి చేశారన్నారు. ఆయన ఆశయాలను ప్రతీ ఒక్కరు కొనసాగించాలని, రాజీవ్ గాంధీ దేశ ప్రజల గుండెల్లో నిత్యం సంజీవుడిగానే ఉంటారని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.