తిరుమలలో జూన్ 30 వరకు విఐపి బ్రేక్‌ దర్శనాలు రద్దు !

J.SURENDER KUMAR,


వేసవి సెలవులు, యాత్రికుల రద్దీ తారాస్థాయికి చేరుకోవడంతో తిరుమల తిరుపతి ఆలయంలో జూన్ 30 వరకు శుక్ర, శని, ఆదివారాల్లో వీఐపీ బ్రేక్ దర్శనాన్ని టీటీడీ రద్దు చేసింది.

సర్వ దర్శన, యాత్రికుల దర్శన సమయాలకు ఇప్పటికే దాదాపు 30 – 40 గంటల సమయం పడుతుండడంతో, సాధారణ యాత్రికుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది.  వీఐపీ బ్రేక్ దర్శనం కోసం ఎలాంటి సిఫార్సు లేఖలను ఆలయ అధికారులు అనుమతించరు టీటీడీ శుక్రవారం జారీ చేసిన ప్రకటనలో పేర్కొంది


భక్తులు ఈ విషయాన్ని గమనించి టీటీడీకి సహకరించాలని ప్రకటన లో కోరారు.