👉 కొనసాగుతున్న భక్తుల రద్దీ..
👉 ఆక్టోపస్ సర్కిల్ నుండి సిలా తోరణం వరకు బస్సులు..
J.SURENDER KUMAR,
తిరుమల క్షేత్రం శనివారం భక్తజనంతో పోటెత్తింది. భక్తుల
సౌకర్యార్థం తిరుమల తిరుపతి దేవస్థానం ఉచిత బస్సు
సౌకర్యాన్ని ఏర్పాటు చేసింది. బాటగంగమ్మ దేవాలయం
వరకు కిలోమీటర్ల కు మించి క్యూ లైన్లు లో భక్తజనం వేచి
ఉన్నారు. తిరుమలలో వేసవి సెలవుల రద్దీ, వారాంతపు
సెలవుల రద్దీ కొనసాగుతోంది.
👉 విస్తృత ఏర్పాట్లు..
భక్తుల సౌకర్యార్థం క్యూ లైన్ల బయట టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది. ఆక్టోపస్ సర్కిల్ నుండి, కృష్ణ తేజ సర్కిల్ వరకు, 27 నీటి పంపిణీ కేంద్రాలను, 4 అన్నప్రసాదాల పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేసింది, అలాగే భక్తులకు సేవలను అందించడానికి 25 మంది విజిలెన్స్ గార్డులు, మరియు ప్రతి పాయింట్‌లో ముగ్గురు సేవకులను నియమించారు.
గత పది రోజుల్లో దాదాపు 2.60 లక్షల మంది యాత్రికులు అలిపిరి మరియు, శ్రీవారి మెట్టు కాలి బాటలలో మాత్రమే వచ్చి శ్రీవారిని దర్శనం చేసుకున్నారు. శనివారం సాయంత్రం 5 గంటల సమయానికి 46,486 మంది యాత్రికులు దర్శనం చేసుకున్నారు.

భక్తుల ప్రయోజనం కోసం, ఆక్టోపస్ సర్కిల్ వద్ద క్యూ లైన్లలోకి ప్రవేశించే భక్తులను, సిలాతోరణం సర్కిల్‌కు తరలించడానికి టిటిడి ఉచిత బస్సులను, విజిలెన్స్ అధికారుల పర్యవేక్షణలో భక్తజనంకు ఉచిత బస్సు సౌకర్యాలు ఏర్పాటు చేశారు
తిరుమలలోని ఎంటీవీఏసీ, బయట క్యూ లైన్లు, ఫుడ్ కోర్ట్‌ల వద్ద అన్నప్రసాదం, నీటి సరఫరా రోజు రోజుకు పెరిగింది. సీనియర్ అధికారులు 24 గంటలూ భక్తుల సౌకర్యాలను పర్యవేక్షిస్తూ సజావుగా ఏర్పాట్లు చేశారు.