👉మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ చిన్న చూపు చూశాడు !
J.SURENDER KUMAR,
ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గం బుగ్గారం మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు బాదినేని రాజమణి, జడ్పిటిసి సభ్యుడు బాదినేని రాజేందర్, బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి గురువారం రాజీనామా చేశారు.
పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన అనంతరం జగిత్యాల జిల్లా కేంద్రంలో తన నివాసంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు..
మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కు ఎంతో సపోర్ట్ చేసి, ఆయన గెలుపు కోసం కృషి చేశాము అన్నారు. ఆయన కూడా మమ్మల్ని చిన్న చూపు చూసినట్లు అనిపించింది. పార్టీని వీడుతుంటే చాలా భాదగా ఉంది అని రాజేందర్ అన్నారు.
పార్టీ ప్రారంభం నుండి కెసిఅర్ గెలవాలని, తెలంగాణ వాదం నిలవాలని బీఆర్ఎస్ పార్టీ కోసం మేము ఎంతో కృషి చేశాం, తెలంగాణ సాధనలో కూడా భాగస్వామ్యం అయ్యాము. అని అన్నారు. పార్టీ పిలుపు మేరకు అన్ని రకాల సేవలు చేశాము కానీ పార్టీ మమ్ములను అణిచివేతకు గురి చేసి చిన్న చూపు చూసింది ఆని ఆవేదన వ్యక్తం చేశారు.

ధర్మపురి నియోజకవర్గంలో టిఆర్ఎస్ పార్టీకి షాక్ తగల నున్నదని మార్చి 27న ‘ఉప్పు’ వార్తా కథనం ప్రచురించింది.
మా కార్యకర్తల, అనుచర గణం, అభిమానుల కోరిక మేరకు బీఆర్ఎస్ పార్టీ కి, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాము. అని వారు ప్రకటించారు. త్వరలో మా భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక ప్రకటిస్తాం అని వారు అన్నారు.