వైభవంగా ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి  జయంతి ఉత్సవం!

J.SURENDER KUMAR,

ప్రముఖ పుణ్యక్షేత్రం ధర్మపురి శ్రీలక్ష్మీనరసింహస్వామి  నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం శ్రీ యోగ , ఉగ్ర లక్ష్మీనరసింహ స్వామి వారల జయంతి ఉత్సవాలు, అంగరంగ వైభవంగా జరిగాయి..
స్వామివారి తొమ్మిది రోజులు పాటు జరిగిన నవరాత్రి ఉత్సవాలు, పూజాది కార్యక్రమాల ముగిశాయి . ఘనంగా ఆరంభమైన ఉత్సవాల్లో,  సహస్ర కలశాభిషేకం,  చందనోత్సవం,  స్వామివారి వసంతోత్సవం, పల్లవ ఉత్సవాలు, నేడు జయంతి ఉత్సవం జరిగాయి.


“శ్రీ నృసింహ నవరాత్రోత్సవములలో”  నృసింహ జయంతి సందర్భముగా శ్రీస్వామి వారికి పురుషసూక్త, శ్రీసూక్త, కల్పోక్త, న్యాసక పూర్వక షోడశ ఉపచార పూజ, సహాస్ర నామార్చన, పంచో పనిషత్తులతో మరియు మన్య సూక్తముతో మరియు సున్నాల వన్నము మరియు రుద్రముతో అభిషేక పూజలు, అభిషేకము, సహస్రనామార్చన, హారతి వేద మంత్ర పుష్పము మరియు చతుర్వేద అవ ధార్యములు భజన కార్యక్రమములు జరిగాయి.


👉స్తంభోధవ పూజలు!


శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ మండపంలోని రాతి స్తంభాలను పట్టు వస్త్రాలు చుట్టి పూలతో అందంగా అలంకరించారు. అర్చకులు వేద పండితులు వేదమంత్రాలతో స్తంభాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

శ్రీ లక్ష్మీనరసింహస్వామి స్థంభం నుండి జన్మించడంతో. వేద పండితులు నరసింహ జయంతి రోజున ఆలయ మంటపంలోని స్తంభానికి ప్రత్యేక పూజలు నిర్వహించడం సాంప్రదాయ.


ఉదయం స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు అర్చకులు నిర్వహించారు. భారీ సంఖ్యలో భక్తజనం రావడంతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది.


ఈ కార్యక్రమములో ఆలయ సూపరింటెండెంట్ కిరణ్, వేదపండితులు బొజ్జ రమేష్ శర్మ, ముత్యాల శర్మ, ప్రవీణ్ కుమార్ శర్మ, ఉపప్రధాన అర్చకులు నేరేళ్ళ శ్రీనివాసాచార్యులు, ముఖ్య అర్చకులు నంబి శ్రీనివాసాచార్యులు, సిహెచ్ రమణయ్య, అర్చకులు నంబి -నర్సింహమూర్తి, నేరేళ్ళ సంతోష్ కుమార్, వొద్దిపర్తి కళ్యాణ్, సముద్రాల వంశీ, చక్రపాణి కిరణా, నంబి అరుణ్. అభిషేక పురోహితులు బొజ్జ సంతోష్ కుమార్, బొజ్జ సంపత్ కుమార్, రాజ్ జగోపాల్ శర్మ, సీనియర్ అసిస్టెంట్ అలువాల శ్రీనివాస్, స్థానిక వేదపండితులు  భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు
.