J.SURENDER KUMAR,
ధర్మారం మండలం కొత్తపల్లి గ్రామం లోని మ్యాదరి కండి చెరువును పత్తిపాక రిజర్వాయర్ కు లింక్ గా ( అనుసంధానం ) పూర్తిస్థాయిలో మరమత్తు చేసి 200 ఎకరాలకు సాగునీరు అందించి రైతాంగానికి మేలు చేస్తానని ధర్మపురి ఎమ్మెల్యే , ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, నీటి పారుదల శాఖ, రెవెన్యూ అధికారులు, రైతులతో కలిసి మంగళవారం మ్యాదరి కండి చెరువును పరిశీలించారు..
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..
గత ప్రభుత్వంలో ₹ 16 కోట్లు నిధులు మంజూరైన కేవలం ₹ 6 కోట్ల రూపాయల పనులు చేశారన్నారు. ఈ చెరువు ఆయకట్టు దాదాపు 200 ఎకరాల వరకు ఉందన్నారు. సాగునీరు అందిచి రైతులకు మేలు చేస్తానన్నారు.

గత కొన్ని రోజులు క్రితం సంబంధిత నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి ని స్వయంగా కలిసి ధర్మపురి నియోజకవర్గ ప్రజానీకానికి సాగు, త్రాగు నీరు సమస్యల గురించి వివరించడం జరిగిందన్నారు. మంత్రి సానుకూలంగా స్పందించి ధర్మపురి నియోజకవర్గ ప్రాంతంలో సాగు, త్రాగు నీరు సమస్య శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తుందని హామీ ఇచ్చినట్టు ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ వివరించారు.
గత ప్రభుత్వ పాలకుల నిర్లక్ష్యం వల్ల ఈ ప్రాంత రైతాంగానికి సాగు, త్రాగు నీరు అందలేదని, పత్తిపాక రిజర్వాయర్ కాలువ, మ్యాదరి కండి చెరువులకు సంబందించిన మిగులు నిధుల విడుదల గూర్చి మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి ని, సీఎం రేవంత్ రెడ్డి నీ కలిసి పరిస్థితి వారికి వివరిస్తానన్నారు.
పత్తిపాక రిజర్వాయర్ ఏర్పాటు విషయంలో తన వంతు కృషి చేసి వెల్గటూర్, ధర్మారం మండల రైతాంగానికి సాగు నీరు అందిస్తామని, రోళ్ల వాగును కూడా త్వరలోనే పూర్తి చేసి ధర్మపురి రైతాంగానికి కూడా సాగు నీరు అందిస్తామని ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ ఈ సందర్భంగా అన్నారు.