👉జమ్మూ బేస్ క్యాంపు నుండి కాశ్మీర్‌కు..
J.SURENDER KUMAR,
మంచు లింగం దర్శనం కోసం భారీ సాయుధ భద్రత దళాల నిఘా నీడలో 319 వాహనాల్లో
ఆదివారం తెల్లవారుజామున 3.50 నుంచి 4.45 గంటల మధ్య కట్టుదిట్టమైన భద్రత మధ్య మూడవ బ్యాచ్ లో 6,600 మంది యాత్రికులు జమ్మూలో భగవతీ నగర్ బేస్ క్యాంప్ నుండి కాశ్మీర్ కు రెండు వేరువేరు మార్గాల ద్వారా బయలుదేరినట్లు పి టి ఐ వార్త సంస్థ కథనం. ఈ బ్యాచ్ లో1,141 మంది మహిళల ఉన్నారు.

👉జమ్మూలో వర్షం….
యాత్రికులు కాశ్మీర్‌కు బయలుదేరినప్పుడు జమ్మూలో వర్షం పడుతోంది, 3,838 మంది భక్తులు పహల్గామ్ మార్గాన్ని ఎంచుకున్నారని, 2,781 మంది యాత్ర చేయడానికి బల్తాల్‌కు వెళుతున్నారని అధికారులు తెలిపారు. లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా మొదటి బ్యాచ్‌ను ప్రారంభించిన జూన్ 28 నుండి మొత్తం 13,103 మంది యాత్రికులు జమ్మూ బేస్ క్యాంపు నుండి లోయకు బయలుదేరారు.
👉కొనసాగుతున్న రిజిస్ట్రేషన్ !

జమ్మూలోని సరస్వతి ధామ్ రైల్వే స్టేషన్‌లో వార్షిక అమర్‌నాథ్ యాత్ర కోసం రిజిస్టర్ చేసుకోవడానికి యాత్రికులు వేచి ఉండగా రైల్వే స్టేషన్ చుట్టూ ఇనుప ముళ్ళ కంచెలు ఏర్పాటుచేసి సాయుధ భద్రతా దళాలు రక్షణగా కాపలా కాస్తున్నారు.

👉 అణువు అణువు జల్లెడ భద్రతా దళాల ఆధీనంలోకి....

కాశ్మీర్ లోయతో పాటు, అమర్నాథ్ మంచు లింగం చేరుకునే రెండు మార్గాలను, భద్రత బలగాలు అణువు అణువు జల్లెడ పట్టి అమర్నాథ్ యాత్ర ఆరంభానికి వారం రోజు ముందు తమ ఆధీనంలోకి తీసుకున్నారు.

ఐజిపి కశ్మీర్ వికె బిర్డి అధ్యక్షతన జరిగిన పలు సమావేశాలలో ఐజి సిఆర్‌పిఎఫ్ (ఎస్‌ఓఎస్) ఐజి సిఆర్‌పిఎఫ్ (కెఓఎస్) శ్రీనగర్, జిఓసి విక్టర్ ఫోర్స్, డిఐజి సిఐడి శ్రీనగర్, డిడి ఐబి శ్రీనగర్, కాశ్మీర్ జోన్ యొక్క సౌత్, సెంటర్ & నార్త్ డిఐఎస్‌జి పాల్గొన్నారు. పోలీస్, CRPF సౌత్, నార్త్ & ఆప్స్ శ్రీనగర్ యొక్క DIsG, DIG, BSF హెడ్ క్వార్టర్స్, శ్రీనగర్, DIG ITBP శ్రీనగర్, SSP శ్రీనగర్, కాశ్మీర్ జోన్ యొక్క అన్ని జిల్లాల SSsP, DC SB శ్రీనగర్, SSP CID SBK, SSP ట్రాఫిక్ సిటీ శ్రీనగర్, SSP APCR శ్రీనగర్, SSP CID CIK, SSP సెక్యూరిటీ కాశ్మీర్, SP PC శ్రీనగర్, SP టెలికాం మరియు ఇతర అధికారులు & ఇతర దళాల ప్రతినిధులతో యాత్రికులు భద్రత ముందస్తు ఏర్పాట్లపై ప్రత్యేక రూట్ మ్యాప్ ను సిద్ధం చేసుకున్నారు.

యాత్ర మార్గాల్లోని క్లిష్టమైన ప్రదేశాలలో CCTV నిఘా వ్యవస్థల కార్యాచరణ సామర్థ్యాన్ని నిర్ధారించాలని VK బిర్డి అధికారులకు వివరించారు.. యాత్ర కాన్వాయ్‌ల సురక్షితమైన మరియు సాఫీగా కదలికను నిర్ధారించడానికి రోడ్ ఓపెనింగ్ పార్టీల (ROPలు) విస్తరణ మరియు కార్యాచరణ సమయాల కు సంబంధించి స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు.
