J.SURENDER KUMAR,
అంగన్ వాడి కేంద్రాల్లో పిల్లల పెరుగుదల పర్యవేక్షణ, నివేదిక, సర్వేల నమోదులో వ్యత్యాసం ఉండరాదని జగిత్యాల కలెక్టర్ బి సత్యప్రసాద్ అంగన్వాడి టీచర్లను ఆదేశించారు. గురించి అడిగారు. పిల్లల పెరుగుదల పర్యవేక్షణ ను క్రమంగా చేపట్టి ఖచ్చితమైన పిల్లల ఎత్తులు, బరువులు నమోదు చేయాలని సర్వే లోని తేడాలు ఉండరాదని అంగన్ వాడి టీచర్లను ఆదేశించారు,
మహిళ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ధర్మపురి లోని ప్రభుత్వ గిరిజన వసతి గృహం లో అంగన్వాడి ఉపాధ్యాయులకు శిక్షణ శిబిరాన్ని కలెక్టర్ శుక్రవారం సందర్శించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ అంగన్వాడి టీచర్లను ఉద్దేశించి మాట్లాడుతూ, జాతీయ నూతన విద్యా విధాన అనుసరించి తయారుచేసిన మూల్యాంకన పుస్తకాలపై అంగన్వాడీ టీచర్లకు సంపూర్ణ అవగాహనతో కూడిన శిక్షణ పొందాలన్నారు. అంగన్వాడి ప్రి స్కూల్ లో బాగంగా అంగన్వాడీ కేంద్ర నిర్వహణ టీచర్, ఆయా, బడిబాట కార్యక్రమం, పూర్వ ప్రాథమిక విద్య యొక్క కొత్త విధానంపై శిక్షణ తప్పనిసరి నేర్చుకోవాలన్నారు. అంగన్వాడి కేంద్రాల్లో శిక్షణ కార్య్రమాల తీరును కలెక్టర్ జిల్లా సంక్షేమ అధికారి నీ అడిగారు.
గ్రామాలలో పంచాయితి సిబ్బంది అంగన్ వాడి కేంద్రాలను పర్యవేక్షణా చేపట్టి ప్రి స్కూల్ పిల్లల విద్య, పెరుగుదల పర్యవేక్షణ చేపట్టి , ఖచ్చితమైన నివేదికలు సమర్పించాలని జిల్లా పంచాయతీ అధికారి ని కలెక్టర్ ఆదేశించారు
ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి వాణి శ్రీ , జిల్లా పంచాయతీ అధికారి దేవ రాజం, పోషణ అభియాన్ జిల్లా కోఆర్డినేటర్, మధు కుమార్ ,సూపర్వైజర్లు అంగన్వాడీ టీచర్లు , పోషణ్ అభియాన్ సిబ్బంది, ఇతర అధికారులు పాల్గొన్నారు.