ఏ ఓ బీ జోన్ లో జులై 1న నిరసన దినాన్ని పాటించండి!

👉 ICSPWI ఇచ్చిన పిలుపును విజయవంతం చేయండి!

👉మావోయిస్టు పార్టీ ఆంధ్ర-ఒడిశా బార్డర్ స్పెషల్ జోనల్ కమిటీ !

J.SURENDER KUMAR,

భారతదేశంలో మావోయిస్టు విప్లవోద్యమంపైన, పీడిత ప్రజలపైన పాలకవర్గాలు ‘కగార్’ పేరుతో కొనసాగిస్తున్న కౄర సైనిక దాడులను నర సంహారాన్నీ, మారణకాండను తీవ్రంగా ఖండిస్తూ జులై 1వ తేదీన నిరసన దినంగా పాటించాల్సిందిగా ICSPWI ( ఇంటర్నేషనల్ కమిటీ ఫర్ ద సపోర్ట్ ఆఫ్ పీపుల్స్ వార్ ఇన్ ఇండియా ) ఇచ్చిన పిలుపు విజయవంతం చేయాలని మావోయిస్టు పార్టీ ఆంధ్ర-ఒడిశా బార్డర్ స్పెషల్ జోనల్ కమిటీ పత్రికా ప్రకటనలో పేర్కొంది.


భారతదేశంలో 5 దశాబ్దాలుగా కొనసాగుతున్న మావోయిస్టు విప్లవోద్యమాన్ని నిర్మూలించేందుకు భారత పాలకవర్గాలు ఆపరేషన్ ‘కగార్’ పేరుతో విప్లవ ప్రతీఘాతుక వ్యూహాత్మక సైనిక క్యాంపెయిన్ను 2024 జనవరి నుండి ప్రారంభించాయి. గత 6 నెలలుగా కొనసాగుతున్న ఈ దాడిలో దండకారణ్య ప్రాంతంలో ఇప్పటి వరకు 6 నెలల పసి పాప నుండి 60 ఏళ్ళ వయో వృద్ధుల వరకు మొత్తంగా 132 మంది ప్రాణాలు కోల్పోయారు. అంటూ ప్రకటనలో పేర్కొన్నారు.

పత్రికా ప్రకటన.

కౄరమైన సైనిక దాడులను నరసంహారాన్ని తీవ్రంగా ఖండిస్తూ భారత ప్రభుత్వం తక్షణమే ఆపరేషన్ ‘కగార’ను నిలిపివేయాలనీ, దండకారణ్యంలో శాంతిని నెలకొల్పాలని డిమాండ్ చేస్తూ అమెరికా, యూరప్, దక్షిణ అమెరికా, ఆఫ్రికా తదితర దేశాలలో ప్రగతిశీలురు, ప్రజాస్వామికవాదులు, వివిధ విప్లవ పార్టీలు, విప్లవ సంస్థలు, వివిధ రూపాలలో తమ నిరసనలను తెలియజేస్తున్నారు.


భారతదేశంలోపల కూడా వివిధ విప్లవ పార్టీలు, ప్రజాస్వామికవాదులు, జర్నలిస్టులు, రచయితలు, కళాకారులు, సామాజిక కార్యకర్తలు, లాయర్లు, మేధావులు ఆపరేషన్ ‘కగార్ కు వ్యతిరేకంగా సభలు, సమావేశాలు, నిరసన ప్రదర్శనలు, బంట్లు నిర్వహిస్తున్నారు. చత్తీస్ ఘడ్లో కార్పొరేటీకరణను నిలిపివేసి, సైనిక క్యాంపులను ఎత్తివేయాల్సిందిగా. ప్రజలపై కౄరమైన దాదులనూ, నరసంహారాన్ని తక్షణమే నిలిపివేయాల్సిందిగా మావోయిస్టు పార్టీతో ప్రభుత్వం శాంతి చర్చలు జరపాల్సిందిగా డిమాండ్ చేస్తూ వివిధ రూపాలలో ఉద్యమిస్తున్నారు. అంటూ ప్రకటనలో పేర్కొన్నారు.


2024 జనవరి 1న చత్తీస్ఘడ్లోని బీజాపూర్ జిల్లా, ముదివెండి గ్రామంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో 6 నెలల పసిపాప చనిపోయింది. ఈ మారనకాండలో చీపురుబట్టి, కొర్చాలి, అపటోల, కాకురు-టేకమేట్ట, పిడియా, రేకవాయి, గోబెల్ ఘటనలలో ఆడ, మగ, చిన్న, పెద్ద అనే తేడా లేకుండా సాధారణ ప్రజలనూ, రైతులను అత్యంత కౄరంగా పోలీసు బలగాలు పట్టుకొని చిత్రహింసలు పెట్టి హత్య చేసాయి ప్రకటనలో పేర్కొన్నారు.

ఇవే కాకుండా ఇంకా అనేక ఘటనలలో పోలీసులు సాధారణ ప్రజలను పట్టుకొని కాల్చిచంపి చనిపోయింది మావోయిస్టులని ప్రకటిస్తున్నారు. ఎక్కౌంటర్ కట్టుకథలల్లుతున్నారు. అంటూ
భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) ఆంధ్ర-ఒడిశా బార్డర్ స్పెషల్ జోనల్ కమిటీ గణేష్ పేరిట జారీ చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.