62 వేల యునిఫామ్స్ 40 వేల పాఠ్య పుస్తకాలు పంపిణీ !

👉. ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట లో !

👉 ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ !


J.SURENDER KUMAR,

ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు జిల్లా లో ఉచితంగా 62 వేల యూనిఫాంలు, 40 వేల పాఠ్య పుస్తకాలు పంపిణీ చేశామని ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

బుధవారం పెగడపల్లి మండల కేంద్రంలో విద్యార్థులకు ఉచిత పాఠ్య, యూనిఫాం లను పంపిణీ చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా ఒక్క రోజే 62730 యునిఫామ్స్ , 40 వేల పాఠ్య పుస్తకాలు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు.


జిల్లాలో ఉన్నత విద్య సంస్థల ఏర్పాటుకు చర్యలకు తనవంతు సహకారం అందించేందుకు సిద్దంగా ఉన్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. క్వాలిఫైడ్ పేగడపల్లి మండలానికి సాగు, త్రాగు నీరు అందించే విధంగా చర్యలు చేపట్టినట్టు లక్ష్మణ్ కుమార్ వివరించారు.


కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా మాట్లాడుతూ,

స్థానిక స్వయం సహాయక బృందాల తో విద్యార్థులకు యూనిఫాం లు కుట్టించడం జరుగుతున్నదని తెలిపారు. 591 పాఠశాలల్లో ₹ 43.50 కోట్లతో అమ్మ ఆదర్శ కమిటీల నేతృత్వంలో పనులు చేపట్టి పూర్తి అవుతున్నాయని తెలిపారు. వందకు వంద శాతం 10/10 సాధించేందుకు ఉపాద్యాయులు కృషి చేయాలని అన్నారు. ప్రతీ రోజూ రాష్ర్ట గీతం పాడించాలని, అందులో ఉన్న అర్థం తెలియజేయాలని ఉపాధ్యాయులను. కోరారు.


అనంతరం విద్యార్థులకు యూనిఫాం, పాఠ్య, నోటు పుస్తకాలు పంపిణీ చేసారు. ఈ కార్య క్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు, మహిళలు, విద్యార్థులు పాల్గొన్నారు.