J.SURENDER KUMAR,

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జగిత్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమంలో ధర్మపురి ఎమ్మెల్యే ,ప్రభుత్వ విప్ అడ్లూరీ లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. అనంతరం జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో పతాకావిష్కరణ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు.

👉మున్సిపల్ కార్యాలయంలో..

అవతరణ దినోత్సవం సందర్భంగా ధర్మపురి మున్సిపల్ కార్యాలయ ఆవరణ లో చైర్ పర్సన్ సంగి సత్యమ్మ, జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కమీషనర్ శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ రామన్న, స్థానిక కౌన్సిలర్స్, కో ఆప్షన్ సభ్యులు, మున్సిపల్ మేనేజర్ గంగాధర్, సానిటరీ ఇన్స్పెక్టర్ గంగాధర్, మెప్మా అధికారులు,ఆర్పీలు, వివిధ పార్టీల నాయకులు, ప్రముఖులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
👉ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో..

ధర్మపురి పట్టణంలో ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ క్యాంప్ కార్యాలయంలో అవతరణ దినోత్సవ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సతీమణి కాంతకుమారి పాల్గొని ప్రసంగించారు. అమరవీరుల త్యాగాల ప్రతిఫలమే నేటి తెలంగాణ రాష్ట్రమని ఆమె అన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో అణచివేత, నిర్బంధం, బానిసత్వం, నిరాదరణను నిరసిస్తూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాకారమే లక్ష్యంగా తొలి, మలి దశ ఉద్యమాల్లో ప్రాణార్పణ చేసిన అమరవీరులు తెలంగాణ ప్రజల గుండెల్లో గుడి కట్టుకున్నారని, ఆమె అన్నారు.