బాధిత కుటుంబాలను పరామర్శించిన ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ !

J.SURENDER KUMAR,

నియోజకవర్గం లోనీ పలు గ్రామాలలో అనారోగ్యం, వివిధ కారణాలతో, మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను, ప్రమాదవశాత్తు గాయపడిన వారిని ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఆదివారం పరామర్శించారు.

పెగడపెల్లి మండలం లింగపూర్ గ్రామానికి చెందిన రాజనర్సయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. వారి కుటుంబాన్ని ఎమ్మెల్యే పరామర్శించి, వారి కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందించారు

👉గొల్లపెల్లి మండలం….

గొల్ల పెల్లి మండల కేంద్రానికి చెందిన బొనగిరి వెంకటేష్ తండ్రి ఇటీవల మృతి చెందరు. వెంకటేష్ కుటుంబాన్ని, బొనగిరి సంపత్ తండ్రి. ఇటీవల మృతి చెందగా కుటుంబాన్ని సైతం ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ పరామర్శించారు.
పాత గంగరాం సోదరుడు ఇటీవల మృతి చెందిన విషయం తెలిసిన ఎమ్మెల్యే గంగరాం కుటుంబాన్ని సైతం పరామర్శించారు.

👉వెల్లటూర్ మండలం….

వెల్గటూర్ మండలం పైడి పల్లి గ్రామానికి చెందిన బెక్కం హరి కృష్ణ తండ్రి ఇటీవల మృతి చెందగా హరి కృష్ణ కుటుంబాన్ని, మండలం లోని కప్పరావు పేట గ్రామానికి చెందిన గండ్ర వేంకటేశ్వర్ రావు తల్లి ఇటీవల మృతి చెందగా వారి కుటుంబాన్ని ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ పరామర్శించారు. ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

👉 రోడ్డు ప్రమాద బాధితులను..

గొల్లపెల్లి మండలం అబ్బపూర్ గ్రామానికి చెందిన కొల్లూరి స్వామి మరియు అతని తల్లి నీ బొంకూర్ గ్రామానికి చెందిన సంతోష్ ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి జగిత్యాల ప్రైవేట్ హాస్పిటల్ చికిత్స పొందుతున్న వారిని ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ పరామర్శించారు.