బిజెపి జాతీయ అధ్యక్షుడుగా కిషన్ రెడ్డి ?

J.SURENDER KUMAR,


భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా సికింద్రాబాద్

పార్లమెంట్ సభ్యుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎంపికపై ఆ

పార్టీ అగ్రనాయకత్వం చర్చిస్తున్నట్టువిశ్వసనీయ వర్గాల

సమాచారం.

ప్రస్తుతం బిజెపి జాతీయ అధ్యక్షుడిగా కొనసాగుతున్న జేపీ నడ్డా పదవి కాలం ముగిసిన, పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఆయననే పార్టీ నాయకత్వం కొనసాగిస్తున్నారు.
ప్రస్తుత కేంద్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఎన్ డి ఏ ప్రభుత్వం ( బిజెపి సింగిల్ లార్జెస్ట్ ) ఆంధ్రప్రదేశ్, బీహార్ లోనీ ఎంపీలే ఎన్డీఏ ప్రభుత్వానికి కీలకం మారారు.

👉 కిషన్ రెడ్డి ఎంపికలో ?..

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం, తెలంగాణ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న కిషన్ రెడ్డి హయాంలో 8 ఎమ్మెల్యే స్థానాలు, 8 పార్లమెంటు స్థానాలు గెల్చుకున్న విషయం తెలిసిందే. ఏబీవీపీ, ఆర్ఎస్ఎస్ కార్యకర్త స్థాయి నుంచి కేంద్ర మంత్రిగా ఎదిగిన కిషన్ రెడ్డికి పార్టీలో గ్రామస్థాయి నుంచి కేంద్ర స్థాయి నాయకత్వం వరకు గుర్తింపు ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల బిజెపి నాయకులతో, ప్రస్తుతం ఏపీలో అధికార తెలుగుదేశం పార్టీ నాయకులతో పాటు అధినేత చంద్రబాబు నాయుడు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో కిషన్ రెడ్డి కి నేటికీ కొనసాగుతున్న స్నేహ సంబంధాలు, బిజెపి అగ్రనాయకత్వం పరిగణంలోకి తీసుకున్నట్టు సమాచారం.

దీనికి తోడు 2019-2024 వరకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా, సాంస్కృతిక పర్యటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రిగా కిషన్ రెడ్డి కొనసాగుతున్నారు. దేశవ్యాప్తంగా బిజెపి నాయకులు, క్యాడర్ తో ఉన్న పరిచయాలు, స్నేహ సంబంధాలతో పాటు, వివాదరహితుడి గా పార్టీకి విధేయుడు గా, కరుడుగట్టిన బిజెపి వాదిగా కిషన్ రెడ్డికి గుర్తింపు ఉంది.

ఇది ఇలా ఉండగా, గత రెండు దశాబ్దాల క్రితం వాజ్ పాయి, ప్రభుత్వంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన మాజీ కేంద్రమంత్రి బంగారు లక్ష్మణ్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, బిజెపి జాతీయ అధ్యక్షులుగా కొనసాగారు.

2014 – 2024 లో మోడీ ప్రధానిగా కొనసాగిన కాలంలో ఉత్తరాదికి చెందిన వారే, ఆ పార్టీ జాతీయ అధ్యక్షులుగా కొనసాగుతున్నారు. 2024 లో బిజెపి పార్టీ 240 ఎంపీ సీట్లకు పరిమితం కావడం, ఈనెల 9న మూడోసారి మోడీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

ఈ నేపథ్యంలో దక్షిణాది ప్రాంతం కర్ణాటక లో 19, ఏపీలో మూడు స్థానాలు, తెలంగాణలో ఎనిమిది ఎంపీ సీట్లను బిజెపి గెలుచుకుంది. ప్రస్తుతం ఎన్డీఏ మంత్రివర్గ ఏర్పాటు లో ఏపీ, బీహార్ మిత్రపక్షాల అభ్యర్థుల కు మంత్రివర్గంలో కీలక పదవులు దక్కే అవకాశం ఉందనే చర్చ ఉంది.

బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి కొనసాగుతున్న కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, నిజాంబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, రెండవసారి విజయం సాధించారు. ఆ పార్టీ ఎంపీలుగా మొదటిసారి గెలిచిన , ఈటల రాజేందర్, డీకే అరుణ, రఘునందన్ రావు, గోడెం నగేష్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి లు మంత్రి పదవులు ఆశిస్తూ, ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం.

మొదటి విడత మంత్రివర్గంలో రాష్ట్రంలోని 8 మంది ఎంపీల లో కిషన్ రెడ్డి మినహా ఎవరికి మంత్రి పదవి వచ్చిన, కిషన్ రెడ్డికి జాతీయ అధ్యక్ష పదవికి బిజెపి అధిష్టానం ఎంపిక చేయడం ఖాయం అనే చర్చ. మోడీ మంత్రి వర్గ విస్తరణలో తెలంగాణలో ఎవరికి అదృష్టం వరిస్తుందో వేచి చూడాల్సిందే.