చొప్పదండి ఎమ్మెల్యే సత్యం ను ఓదార్చిన సీఎం రేవంత్ రెడ్డి !

J.SURENDER KUMAR,


చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ను ఆయన కుటుంబ సభ్యులను శనివారం సీఎం రేవంత్ రెడ్డి వారింటికి వెళ్లి పరామర్శించి ఓదార్చారు.


ఎమ్మెల్యే సతీమణి రూపాదేవి నిన్న మృతి చెందిన విషయం తెలిసిందే. సీఎం ఎమ్మెల్యే సతీమణి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు ధైర్యం చెప్పి పిల్లలను, కుటుంబ సభ్యులను ఓదార్చారు. సీఎం వెంట వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తదితరు లు ఉన్నారు.