👉ఉపాధ్యాయ సంఘ నాయకులు !
J.SURENDER KUMAR,
సీఎం రేవంత్ రెడ్డి గారు గత 15 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న అప్‌గ్రెడేషన్ సమస్యను పరిష్కరించడంతో పాటు పదోన్నతులు కల్పించినందుకు మీకు కృతజ్ఞతలు అంటూ ఉపాధ్యాయ సంఘాల నాయకులు సీఎంను ఘనంగా సన్మానించారు.
హైదరాబాదులో ఆదివారం వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు. ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ పీఆర్టీయూ వ్యవస్థాపక అధ్యక్షులు హర్షవర్ధన్ రెడ్డితో పాటు వివిధ ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఉన్నారు.