J.SURENDER KUMAR,
ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్,
జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ కుమార్ తో
కలిసి జీవన్ రెడ్డి మంగళవారం మధ్యాహ్నం ఢిల్లీకి
పయనమయ్యారు.
జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, కాంగ్రెస్ లో చేరిక, మనస్థాపంతో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తన పదవికి రాజీనామా ఎపిసోడ్ ఢిల్లీకి చేరిన విషయం తెలిసిందే. ఈ అంశంపై చర్చించడానికి కాంగ్రెస్ హై కమాండ్ జీవన్ రెడ్డిని ఢిల్లీకి పిలిచింది.

తన అనుచర గణంతో, కొందరు రాష్ట్ర నాయకులతో చర్చించిన జీవన్ రెడ్డి, ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ తో కలిసి ఢిల్లీకి వెళ్లారు.
ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తో పాటు ప్రభుత్వ, పార్టీ ట్రబుల్ షూటర్ మంత్రి శ్రీధర్ బాబు, ఉత్తంకుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జితేందర్ రెడ్డి, తదితరులు ఢిల్లీలోనే ఉన్నారు.