ధర్మపురి నరసింహుడి హుండి ఆదాయం₹ 48 లక్షలు !

J.SURENDER KUMAR,


ధర్మపురి శ్రీలక్ష్మీనరసింహస్వామి హుండీ ఆదాయం ₹ 48,67, 803/- నగదు ఆదాయం వచ్చినట్టు ఆలయ కార్యనిర్వహణాధికారి సంకటాల శ్రీనివాస్ తెలిపారు.


మార్చి 30 నుండి ఈనెల 12 వరకు, 74 రోజుల హుండీ ఆదాయం లెక్కించగా నగదు, 120 గ్రాముల మిశ్రమ బంగారం, 6 కిలోల 450 గ్రాముల మిశ్రమ వెండి, 20 విదేశీ కరెన్సీ నోట్లు వచ్చినట్టు తెలిపారు. కరీంనగర్ దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ చంద్రశేఖర్ పర్యవేక్షణలో , నిఘా నీడలో హుండీ లెక్కింపు జరిగింది.